రాను హైదరాబాదు (Ranu Hyderabad) - Folk Song Lyrics
MUSIC : SRIKOTI
LYRICS : SRIDHAR PALLE (SHASHI)
SINGER'S : HANMANTHYADAV - PRABHA
(పురుషుడు)
అద్దాల చీర గట్టి సన్నంచు రైక తొడిగి
మస్తుగ నువ్వున్నవే
జబర్దస్తుగ నువ్వున్నవే
(స్త్రీ)
కండ్లకు అద్దాలు పెట్టి కోర మీసాలు తిప్పి
కన్నే కొడుతున్నావు
భలే కథలే పడుతున్నావు
(పురుషుడు)
రబ్బరు గాజులు నీకు కొనిపిస్తానే
రంగుల రాట్నం నిన్ను ఎక్కిస్తానే
(స్త్రీ)
మిఠాయింటి మాటలతో
పటాయించకోయ్
పరషాను చేయకోయ్
(పురుషుడు)
వస్తావా నాతోటి హైదరాబాదు
తినిపిస్తానే స్పెషల్ బిర్యానీ నీకు
(స్త్రీ)
రాను రానురో నీతోని హైదరాబాదు
ఏం వద్దు నువ్వు చేసే మర్యాదలు నాకు
చరణం 1:
(పురుషుడు)
కండ్లకు కాటుక పెట్టి
కొప్పున మల్లెలు చుట్టి
కత్తి లెక్క ఉన్నవే
యమ ఖతర్నాక్ ఉన్నవే
(స్త్రీ)
ఏళ్లకు ఉంగరాలు పెట్టి
చేతికి గడియారం పెట్టి
సైగలు చేస్తున్నావ్
అరె షకలే పడుతున్నావ్
(పురుషుడు)
పట్నం అంతా తిప్పి నీకు చూపిస్తానే
నువ్వు అడిగింది ఏదైనా కొనిపిస్తానే
(స్త్రీ)
ఆ పట్నం వద్దు నువ్వు వద్దు...
వర్రె యకురో నన్ను వదిలేయరా
(పురుషుడు)
హే వస్తావా నాతోటి హైదరాబాదు
చార్మినార్ లో కొనిపిస్త నఖిలేసు గొలుసు
(స్త్రీ)
అబ్బ రానురో నీతోని హైదరాబాదు
ఏం వద్దురో నకిలీ నకిలీసు నాకు
చరణం 2:
(పురుషుడు)
బొమ్మల నడుమ బొట్టు పెట్టి
లిప్పుకు లిప్ స్టిక్ పెట్టి
బొమ్మోలె ఉన్నవే
హే బొంబాటు గున్నవే
(స్త్రీ)
తెల్లంగి పంచె కట్టి
ఎర్రని రుమాలు చుట్టి
పోజులు కొడుతున్నవ్
యహ పొమ్మంటే పోవేందిరో
(పురుషుడు)
నిన్ను గోలుకొండ కోటకు రాణిని చేస్తానే
భాగ్యనగర్ పేరు మార్చి నీ పేరు పెడతానే
(స్త్రీ)
నగరాలు చాలు పిచ్చి బాగా ముదిరిందిరో
ఎర్రగడ్డకు పోరో
(పురుషుడు)
హే వస్తావా నాతోటి హైదరాబాదు
రాసిస్తానే వస్తే హైటెక్ సిటీ నీకు
(స్త్రీ)
అబ్బబ్బ రానురో నీతోని హైదరాబాదు
నీ మోతే పాడు.. మాటలింక ఆపరా బాబు
చరణం 3:
(పురుషుడు)
చెవులకు కమ్మలు పెట్టి
ముక్కుకు ముక్కెర పెట్టి
ముద్దుగ నువ్వున్నవే
భలే ముద్దొస్తున్నవే
(స్త్రీ)
అత్తరు సెంటు కొట్టి
మెత్తని మాటలతో
మాయలు చేస్తున్నావ్
ఏ మంత్రమేస్తున్నావ్
(పురుషుడు)
నీ అనుమానం పాడుగాను ఏమి సయ్యనే
నీ మీద ఉన్న ప్రేమను ఇంకెట్ల చనుప్పనే
(స్త్రీ)
ఇగ చాలు చాలు నీ మాటలు నేను నమ్మరో
వేషాలు ఆపురో
(పురుషుడు)
అరెరె వస్తావా నాతోటి హైదరాబాదు
రాసిస్తానే వస్తే నా ఆస్తి నీకు
(స్త్రీ)
అయితే వస్తారో నీతోని హైదరాబాదు
ఎక్కిస్తారో ఇప్పుడే నీ మోటార్ బైకు
అద్దాల చీర గట్టి సన్నంచు రైక తొడిగి
మస్తుగ నువ్వున్నవే
జబర్దస్తుగ నువ్వున్నవే
(స్త్రీ)
కండ్లకు అద్దాలు పెట్టి కోర మీసాలు తిప్పి
కన్నే కొడుతున్నావు
భలే కథలే పడుతున్నావు
(పురుషుడు)
రబ్బరు గాజులు నీకు కొనిపిస్తానే
రంగుల రాట్నం నిన్ను ఎక్కిస్తానే
(స్త్రీ)
మిఠాయింటి మాటలతో
పటాయించకోయ్
పరషాను చేయకోయ్
(పురుషుడు)
వస్తావా నాతోటి హైదరాబాదు
తినిపిస్తానే స్పెషల్ బిర్యానీ నీకు
(స్త్రీ)
రాను రానురో నీతోని హైదరాబాదు
ఏం వద్దు నువ్వు చేసే మర్యాదలు నాకు
చరణం 1:
(పురుషుడు)
కండ్లకు కాటుక పెట్టి
కొప్పున మల్లెలు చుట్టి
కత్తి లెక్క ఉన్నవే
యమ ఖతర్నాక్ ఉన్నవే
(స్త్రీ)
ఏళ్లకు ఉంగరాలు పెట్టి
చేతికి గడియారం పెట్టి
సైగలు చేస్తున్నావ్
అరె షకలే పడుతున్నావ్
(పురుషుడు)
పట్నం అంతా తిప్పి నీకు చూపిస్తానే
నువ్వు అడిగింది ఏదైనా కొనిపిస్తానే
(స్త్రీ)
ఆ పట్నం వద్దు నువ్వు వద్దు...
వర్రె యకురో నన్ను వదిలేయరా
(పురుషుడు)
హే వస్తావా నాతోటి హైదరాబాదు
చార్మినార్ లో కొనిపిస్త నఖిలేసు గొలుసు
(స్త్రీ)
అబ్బ రానురో నీతోని హైదరాబాదు
ఏం వద్దురో నకిలీ నకిలీసు నాకు
చరణం 2:
(పురుషుడు)
బొమ్మల నడుమ బొట్టు పెట్టి
లిప్పుకు లిప్ స్టిక్ పెట్టి
బొమ్మోలె ఉన్నవే
హే బొంబాటు గున్నవే
(స్త్రీ)
తెల్లంగి పంచె కట్టి
ఎర్రని రుమాలు చుట్టి
పోజులు కొడుతున్నవ్
యహ పొమ్మంటే పోవేందిరో
(పురుషుడు)
నిన్ను గోలుకొండ కోటకు రాణిని చేస్తానే
భాగ్యనగర్ పేరు మార్చి నీ పేరు పెడతానే
(స్త్రీ)
నగరాలు చాలు పిచ్చి బాగా ముదిరిందిరో
ఎర్రగడ్డకు పోరో
(పురుషుడు)
హే వస్తావా నాతోటి హైదరాబాదు
రాసిస్తానే వస్తే హైటెక్ సిటీ నీకు
(స్త్రీ)
అబ్బబ్బ రానురో నీతోని హైదరాబాదు
నీ మోతే పాడు.. మాటలింక ఆపరా బాబు
చరణం 3:
(పురుషుడు)
చెవులకు కమ్మలు పెట్టి
ముక్కుకు ముక్కెర పెట్టి
ముద్దుగ నువ్వున్నవే
భలే ముద్దొస్తున్నవే
(స్త్రీ)
అత్తరు సెంటు కొట్టి
మెత్తని మాటలతో
మాయలు చేస్తున్నావ్
ఏ మంత్రమేస్తున్నావ్
(పురుషుడు)
నీ అనుమానం పాడుగాను ఏమి సయ్యనే
నీ మీద ఉన్న ప్రేమను ఇంకెట్ల చనుప్పనే
(స్త్రీ)
ఇగ చాలు చాలు నీ మాటలు నేను నమ్మరో
వేషాలు ఆపురో
(పురుషుడు)
అరెరె వస్తావా నాతోటి హైదరాబాదు
రాసిస్తానే వస్తే నా ఆస్తి నీకు
(స్త్రీ)
అయితే వస్తారో నీతోని హైదరాబాదు
ఎక్కిస్తారో ఇప్పుడే నీ మోటార్ బైకు
This lyrics are for educational and promotional purposes only.
All rights belong to the respective owners.





.jpg)


