Oka chinna Mata లేబుల్‌తో ఉన్న పోస్ట్‌లను చూపుతోంది. అన్ని పోస్ట్‌లు చూపించు
Oka chinna Mata లేబుల్‌తో ఉన్న పోస్ట్‌లను చూపుతోంది. అన్ని పోస్ట్‌లు చూపించు

ఓ మనసా తొందర పడకే | చెప్పవమ్మ చెప్పు | Oka Chinna Mata | O Manasa Thondara Padake |


ఆఆ..ఆఆ...ఆఆఆ

లల్లలల్లలాలల 

లల్లలల్లలాలల

ఆమె 

ఓ మనసా తొందర పడకే

పది మందిలో అల్లరి తగదే

కను చూపులు కలిసే వేళ

నా మాటలు కొంచెం వినవే

వరమిచ్చిన దేవుని చూసే

సుముహూర్తమొస్తున్న వేళ

నీకెందుకే ఈ తొందర

అతడు 

ఓ మనసా తొందర పడకే

పది మందిలో అల్లరి తగదే

కను చూపులు కలిసే వేళ

నా మాటలు కొంచెం వినవే

చిరు నవ్వుల దేవిని చూసే

సుముహూర్త మొస్తున్న వేళ

నీకెందుకే ఈ తొందర

కోరేస్ ఫేమలే 

చెప్పవమ్మ చెప్పు ఒక చిన్న మాట

చిన్నవాడి మనసు నీతో అన్న మాట

కోరేస్ మేల్ 

చెప్పు చెప్పు చెప్పు ఒక చిన్న మాట

చిన్నదాని మనసు నీతో అన్న మాట

అతడు

తాజా గులాబి కన్నా 

మురిపించు మల్లెల కన్నా

మెరిసే తార కన్నా 

తన తలపే నాకు మిన్న

ఆమె 

ఓ... వేదాల ఘోష కన్నా 

చిరుగాలి పాట కన్నా

ప్రియమార నన్ను తలిచే 

తన మనసే నాకు మిన్న

అతడు

మోహం తొలి మోహం

కను గీటుతున్న వేళ

ఆమె 

రాగం అనురాగం 

ఎద పొంగుతున్న వేళ

చెప్పాలి ఒక చిన్న మాట

ఆమె కోరేస్:  

చెప్పవమ్మ చెప్పు ఒక చిన్న మాట

చిన్నవాడి మనసు నీతో అన్న మాట

అతడు కోరేస్ :

చెప్పు చెప్పు చెప్పు ఒక చిన్న మాట

చిన్నదాని మనసు నీతో అన్న మాట

అతడు

ఆఆఆ ఆఆఆ 

దనిస పద నిస మ ప ద ని స 

సగగ నిస ఆఆఆ ఆఆఆ 

ఆమె 

నాలోని ఆశ తానై

తనలోని శ్వాస నేనై

రవళించు రాగమేదో 

పలికిందీ క్షణాన నాలో

అతడు

ఓ... నా కంటి పాప తానై 

తన కొంటె చూపు నేనై

ఆడేటి ఊసులన్నీ 

మెదిలాయీ క్షణాన నాలో

ఆమె 

గాలి చిరుగాలి కబురైనా చేర్చలేవా

చెలిమి నిచ్చెలిమి 

ఒకమారు చూపలేవా

విరహాన వేచే క్షణాన

ఆమె కోరేస్ 

చెప్పవయ్య చెప్పు ఒక చిన్న మాట

చిన్నదాని మనసు నీతో అన్న మాట

అతడు కోరస్ 

చెప్పు చెప్పు చెప్పు ఒక చిన్న మాట

చిన్నవాడి మనసు నీతో అన్న మాట


అతడు

ఓ మనసా తొందర పడకే

పది మందిలో అల్లరి తగదే

కను చూపులు కలిసే వేళ

నా మాటలు కొంచెం వినవే

చిరు నవ్వుల దేవిని చూసే

సుముహూర్తమొస్తున్న వేళ

నీకెందుకే ఈ తొందర


ఆమె కోరేస్  

లల్లలల్లలల్లలల్ల లల్లలాలా

అతడు కోరేస్ 

లల్లలల్లలల్లలల్ల లల్లలాలా

ఆమె  కోరేస్ 

లల్లలల్లలల్లలల్ల లల్లలాలా

అతడు కోరేస్

లల్లలల్లలల్లలల్ల లల్లలాలా

ఆమె కోరేస్ 

లల్లలల్లలల్లలల్ల లల్లలాలా

లల్లలల్లలల్లలల్ల లల్లలాలా