male female lyrics separetion లేబుల్‌తో ఉన్న పోస్ట్‌లను చూపుతోంది. అన్ని పోస్ట్‌లు చూపించు
male female lyrics separetion లేబుల్‌తో ఉన్న పోస్ట్‌లను చూపుతోంది. అన్ని పోస్ట్‌లు చూపించు

 


పల్లవి: 

అతడు 

ఆకాశ దేశాన మందాకిని 

నీకోసమొచ్చానమ్మా ఓ లేఖని 

నీలాల కన్నుల్లోన సౌదామిని 

ఓ కలలాగ వచ్చా నీతో ఉండామని 

ఆపిన ఆగనంది  నీ ప్రేమ 

ఉప్పెనై  రేపుతోంది నాలోన 

సన్నగా చెంతకు చేరి... 

మనసుకే చూపవే దారి 

విన్నపం వినవే చిన్నారి


ఆకాశ దేశాన మందాకిని 

నీకోసమొచ్చానమ్మా ఓ లేఖని


చరణం 1: 

అతడు

నీకోసమే స్వర్గాన్ని కాలదన్ని 

వచ్చానులే ఓ పిచ్చి పిచ్చగాన్ని 


ఆమె 

ఆ పిచ్చిలే తెగ నచ్చి మెచ్చుకున్నా 

నీ మనసునే మనసిచ్చి పుచ్చుకున్నా


అతడు

ఇదే నా ప్రేమ గానం... 

నువ్వేలే నాకు ప్రాణం 


ఆమె 

పెదాల్లో వేణు గానం... 

నరాల్లో వాయులీనం


అతడు

మత్తుగా ఉందే నారి... 

పిచ్చికో ఎందుకోసారి 

ముద్దులో మద్యం దాగుంది... 


ఆమె 

తెలియని పద్యంలా ఉంది...


అతడు

ఆకాశ దేశాన మందాకిని 

నీకోసమొచ్చానమ్మా ఓ లేఖని 


ఆమె 

నీలాల కన్నుల్లోన సౌదామిని 

ఓ కలలాగ వచ్చా నీతో ఉండామని


చరణం 2: 

ఆమె 

నీ స్నేహమే నా పూర్వజన్మ పుణ్యం 

నీ స్పర్శతో ఈ ఆడ ఈడు ధన్యం

 

అతడు

నువ్వే కదా ఓ మధుర మిధునా  స్వప్నం 

చేయాలిలే ఆ కలను ఇలను సత్యం


ఆమె 

ఎదోలా ఉంది హృదయం... 

నువ్వేగా నాకు అభయం 


అతడు

ఇదేగా ప్రేమ నిలయం... 

భయాలే నేడు ఉభయం


ఆమె 

సాహసం చేయ్యాలంది  

సరసమే సహజమంది 

మనసుతో ఒకటై ఇబ్బంది 


అతడు

ఓ.. అందుకే నాకే ఇమ్మంది...


ఆమె 

ఆకాశ దేశాన మందాకిని... 

తన మనసార మెచ్చిందయ్య నీ లేఖని... 


అతడు

నీలాల కన్నుల్లోన సౌదామిని... 

నా మది దోచుకున్నావమ్మ గజగామిని...


ఆమె 

నీవు నా ప్రాణమందీ ఈ దేహం 

గుండెలో ఆరుకుంది ఓ  దాహం 


అతడు

మాటతో మంత్రం వేస్తా... 

ఆశతో ఆరాధిస్తా... 

కళ్ళతో కాముని కవ్విస్తా...