Endharo Cheppina Mate Kada Song Lyrics in Telugu | ఎందరో చెప్పిన మాటే కదా | ఇడ్లీ కొట్టు | కృష్ణ తేజస్వి | G.V ప్రకాష్ కుమార్ | ధనుష్

పేరు: ఎందరో చెప్పిన


చిత్రం : ఇడ్లీ కొట్టు 
గాయకుడు: కృష్ణ తేజస్వి 
సంగీతం: G.V ప్రకాష్ కుమార్ 
దర్శకుడు: ధనుష్ 



ఎందరో చెప్పిన మాటే కదా
కళ్ళ ముందరే ఉన్న దారే కదా
కొందరే ముందన్న తీరొద్దికా

కష్ట పడ్డోడికే దైవం తోడుండదా

మట్టి వాసన గుర్తుంచుకో
నీ తండ్రి ఆశే దాగుందిగా
చిక్కి చితికిన విత్తనంలో
ఓ వంశ వృక్షమే దాగుందిగా

తర తరాల చెమట చుక్కలు లాల పోసెను భూమికే
బాధ్యతగ కొనసాగినాదో నైవేద్యమేగా స్వామికే
పేగు బంధమె ఊరికున్నది తెలుసుకుంటే స్వర్గమే
అడుగు పెడితే గడప నవ్వెను గర్భ గుడి స్వగ్రామమే

ఎందరో చెప్పిన మాటే కదా
కళ్ళ ముందరే ఉన్న దారే కదా
కొందరే ముందన్న తీరొద్దికా
కష్ట పడ్డోడికే దైవం తోడుండదా

వెక్కిరింతలు లెక్కచేయకు..
వెక్కిరింతలు లెక్కచేయకు
పళ్ళున్న చెట్టుకు అలవాటేగా
కలత చెందకు చందమామకే
ఏటేట చవితికి నిందలేగా

ఓటమన్నది గురువు కదరా ఓర్పుతో నువ్వు గెలవవా
రేపుకే దిస్క్సూచి నిన్న రెక్కలే చుక్కానిరా
నీరు నేల ఆకాశం నీపై చూపెను పాశం
దారే తప్పిన పాదాలు గాడిన పడితె సంతోషం

తర తరాల చెమట చుక్కలు లాల పోసెను భూమికే
బాధ్యతగ కొనసాగినాదో నైవేద్యమేగా స్వామికే
పేగు బంధమె ఊరికున్నది తెలుసుకుంటే స్వర్గమే
అడుగు పెడితే గడప నవ్వెను గర్భ గుడి స్వగ్రామమే

ఎందరో చెప్పిన మాటే కదా
కళ్ళ ముందరే ఉన్న దారే కదా
కొందరే ముందన్న తీరొద్దికా
కష్ట పడ్డోడికే దైవం తోడుండదా

మట్టి వాసన గుర్తుంచుకో
నీ తండ్రి ఆశే దాగుందిగా
చిక్కి చితికిన విత్తనంలో
ఓ వంశ వృక్షమే దాగుందిగా


కామెంట్‌ను పోస్ట్ చేయండి

0 కామెంట్‌లు