గానం: బులెట్ బండి లక్ష్మణ్ (Bullet Bandi Laxman)
సాహిత్యం: నల్గొండ గద్దర్ (Nalgonda Gaddar)
మణికంఠ నామం అయ్యప్ప సాంగ్ లిరిక్స్ (Manikanta Naamam Ayyappa Telugu Lyrics)
పల్లవి:
స్వామియే... శరణమయ్యప్ప!
అతడు
ఆ హరి నామం... ఆ శివ నామం
నుదుటిన దిద్దుకున్నా నీ మణికంఠయ నామం
ఆ కైలాసం... ఆ వైకుంఠం
చేరగా వస్తున్నా నీ శబరిమల క్షేత్రం
ఓ మణికంఠ నీ మాలేసుకున్నా
నా పైన కురవనీ నీ దీవెన వాన
ఏ చిక్కుముడులు రాకుండా ఇరుముడులు చేరేలా
సామి నీ శబరిమలకి...
నా హరి నామం... నా శివ నామం
నుదుటిన దిద్దుకున్నా నీ మణికంఠయ నామం
ఆ కైలాసం... ఆ వైకుంఠం
చేరగా వస్తున్నా నీ శబరిమల క్షేత్రం
కోరస్:
కుసుమాల మాలలు నీ సేవకే... సామి నీ సేవకే
పాలాభిషేకాలు పాదాలకే... సామి పాదాలకే
తేనేటి తానాలు... నూసేయవే సామి నూసేయవే
దీపాల కాంతుల్లో వెలుగుతుండే... సామి వెలుగుతుండే
చరణం 1:
అతడు
అమ్మ ఒడి వదిలి నీ గుడిలో పడుకుంటున్నా
అమ్మ గురుతే రాకుండా చూడు నా అయ్యప్ప
నాన్న ప్రేమొదిలి నీ ప్రేమలో నేనుంటున్నా
నాన్న గురుతే రాకుండా చూడు నా అయ్యప్ప
చల్లని నీళ్లే ఎంత వెచ్చగున్నాయే
నా సామి నీ భక్తిలోన స్నానం చేస్తే
అర్ధాకలే ఎంత కమ్మగున్నదే
నా సామి నీ భక్తిలోన భిక్షను చేస్తే
పంపావాసా నాకు ఉన్నది ఒక కోరిక సామి... (మీ... మీ...)
ఏ చిక్కుముడులు లేకుండా ఇరుముడులు చేరాలి
సామి నీ శబరిమలకి...
ఆ హరి నామం... ఆ శివ నామం
నుదుటిన దిద్దుకున్నా నీ మణికంఠయ నామం
ఆ కైలాసం... ఆ వైకుంఠం
చేరగా వస్తున్నా నీ శబరిమల క్షేత్రం
చరణం 2:
మాలలోన ఎంతటి మహిమ దాగున్నదే
మనిషిలోన దేవుణ్ణే నే చూస్తున్నానే
మనిషి మనిషినే సామీ అని అంటున్నానే
నా సామీ ఈ లోకమంత నీ అంశనే
మలినాలను చేరిపింది సామీ నాలో ఈ మాల
మానవత్వం నింపింది సామీ నాలోన చాలా
నీ మెట్టు మెట్టుకు పడి పడి పూజలు చేసుకున్నానే
నెత్తినెత్తుకొని కదిలితి ఇరుముడిని
ఆ హరినామం... ఆ శివనామం...
నుదుటిన దిద్దుకున్న నీ మణికంటయ్య నామం
ఆ కైలాసం... ఆ వైకుంఠం...
చేరగా వస్తున్న నీ శబరిమల క్షేత్రం
శ్లోకం:
భూతనాథ సదానంద సర్వభూత దయాపర
రక్షరక్ష మహాబాహో శాస్త్రేతుభ్యం నమోనమః
భూతనాథ సదానంద సర్వభూత దయాపర
రక్షరక్ష మహాబాహో శాస్త్రేతుభ్యం నమోనమః
చరణం 3:
ఊరూరు దాటి నీ ఊరునే చేరొస్తున్నా
నా ఊరు గురుతు రానియ్యకు నా అయ్యప్ప
ప్రతి మనిషికి నీ దర్శనమిస్తూ వస్తున్నా
నాకు దర్శనమియ్యే సామి నా అయ్యప్ప
కాలి బొబ్బలు పగిలి అడుగు నెత్తుటి అచ్చు
వెనుక సాములనే నడుపుతుంది సామిని వైపు
ఎత్తైన కొండ ఎక్కి అలసి పోయిన నాకు
సంబూరమైతు వుందే దగ్గరైతుంటే నీకు
శబరివాసా నిన్ను కళ్ళ చూసి నా మణికంఠ
ధగ ధగ వెలిగే మకర జ్యోతిలో...
నా శివ రూపం... నా హరి రూపం
కళ్ళారా చూస్తానే నా మణికంఠయ రూపం...
ఆ కైలాసం... ఆ వైకుంఠం
చేరగా వస్తున్నా నీ శబరిమల క్షేత్రం

0 కామెంట్‌లు