చిత్రం: ఒకే కుటుంబం
గానం: ఘంటసాల
సంగీతం: ఎస్.పి. కొత్వండపాణి
సాహిత్యం: దాశరథి కృష్ణమాచార్యులు
నటీనటులు: ఎన్.టి.ఆర్, లక్ష్మి
మంచిని మరచి వంచన నేర్చి
మంచిని మరచి వంచన నేర్చి
నరుడే ఈనాడు...వానరుడైనాడు
వానరుడైనాడు
మంచిని మరచి వంచన నేర్చి
మంచిని మరచి వంచన నేర్చి
నరుడే ఈనాడు వానరుడైనాడు
వానరుడైనాడు
చదువు తెలివి పెంచాడు
చంద్రలోకము జయించాడు
చదువు తెలివి పెంచాడు
చంద్రలోకము జయించాడు
నీతులు చెప్పి గోతులు తవ్వి
పాతాళానికి జారాడు
మెదడే పెరిగి హృదయం తరిగి
నరుడే ఈనాడు వానరుడైనాడు
వానరుడైనాడు
ఓఓ ఓ ఓఓ
అందరి చెమట చిందించాడు
సంపద ఎంతో పెంచాడు
అందరి చెమట చిందించాడు
సంపద ఎంతో పెంచాడు
పంపకమంటూ వచ్చేసరికి
అంతా తనదే అన్నాడు
ధనమే హెచ్చి గుణమే చచ్చి
నరుడే ఈనాడు వానరుడైనాడు
వానరుడైనాడు
.jpg)
కామెంట్‌లు లేవు:
కామెంట్‌ను పోస్ట్ చేయండి