చిత్రం: ఆహ్వానం
రచయిత: సిరివెన్నెల
సంగీతం: sv కృష్ణా రెడ్డి
గానం: బాలు, చిత్ర
రచయిత: సిరివెన్నెల
సంగీతం: sv కృష్ణా రెడ్డి
గానం: బాలు, చిత్ర
అతడు
పందిరివేసిన ఆకాశానికి
ఇవ్వమ్మా ఆహ్వానం
పీటను వేసిన ఈ నేలమ్మకి
ఇవ్వమ్మా ఆహ్వానం
నువ్వు రామ్మా ఓ వేదమా...
విడాకుల పత్రిక అందుకుని
వెంటనే వేంచేయమ్మా
దంపతుల విడదీసే మంత్రం
కొత్తగా నేర్చుకోవమ్మా
పందిరివేసిన ఆకాశానికి
ఇవ్వమ్మా ఆహ్వానం
పీటను వేసిన ఈ నేలమ్మకి
ఇవ్వమ్మా ఆహ్వానం
పందిరివేసిన ఆకాశానికి
ఇవ్వమ్మా ఆహ్వానం
పీటను వేసిన ఈ నేలమ్మకి
ఇవ్వమ్మా ఆహ్వానం
నువ్వు రామ్మా ఓ వేదమా...
విడాకుల పత్రిక అందుకుని
వెంటనే వేంచేయమ్మా
దంపతుల విడదీసే మంత్రం
కొత్తగా నేర్చుకోవమ్మా
పందిరివేసిన ఆకాశానికి
ఇవ్వమ్మా ఆహ్వానం
పీటను వేసిన ఈ నేలమ్మకి
ఇవ్వమ్మా ఆహ్వానం
అతడు
ప్రతిమనువూ స్వర్గంలో మునుముందే
ముడిబడుతుందా
ఆ మాటే నిజమైతే
ఈ చట్టం విడగొడుతుందా
ఆమె
నీ రాతకు ఎంత సత్యం ఉందో
చూద్దువు బ్రహ్మయ్యా
నీ సాక్ష్యం ఎంత విలువైందో
ఓ అగ్ని చూడయ్యా
నువ్వు రామ్మా ఓ అరుంధతి...
ఇదే నీ దర్శన ఫలమైతే
ఎటైనా దాగిపోవమ్మా
నిజంగా పెళ్లికి బలముంటే
సూటిగా ఇటు దిగిరావమ్మా
అతడు
పందిరివేసిన ఆకాశానికి
ఇవ్వమ్మా ఆహ్వానం
పీటను వేసిన ఈ నేలమ్మకి
ఇవ్వమ్మా ఆహ్వానం
అతడు
చితిమంటల సహగమనం
ఒకసారే బలిచేస్తుంది
పతి విడిచిన సతిగమనం
ప్రతి నిమిషం రగిలిస్తుంది
ఆమె
ఆ జ్వాలలతోనే జీవించేటి
ధైర్యం అందిస్తూ
ఓ బంధువులారా దీవించండి
దీర్ఘ సహనమస్తు
నువ్వు రామ్మా మాంగల్యమా...
వివాహపు వేదికలో నిన్ను
ముడేసిన నిన్నటి వేళ్లకు
విడాకుల వేడుకలో నేడు
తెoపడం నేర్పడానికి
అతడు
పందిరివేసిన ఆకాశానికి
ఇవ్వమ్మా ఆహ్వానం
పీటను వేసిన ఈ నేలమ్మకి
ఇవ్వమ్మా ఆహ్వానం

0 కామెంట్‌లు