చిత్రం : సూత్రధారులు (1989)సంగీతం : కె.వి. మహదేవన్గీతరచయిత : సినారెనేపధ్య గానం : బాలు, శైలజ
అతడు
ఆ ఆ ఆ ఆ ఆ
కలలెందుకు కథలెందుకు
తలపెందుకు తపమెందుకు
ఆమె
కలలెందుకు కథలెందుకు
తలపెందుకు తపమెందుకు
అతడు
కోర్కెలన్ని కనులముందే
కొలువు తీరిన వేళ
ఆమె
కోర్కెలన్ని కనులముందే
కొలువు తీరిన వేళ
అ: కలలెందుకు
ఆ: కథలెందుకు
అ: తలపెందుకు
ఆ: తపమెందుకు
అతడు
తలవాకిట ప్రేమరథం
తలుపు తట్టి నిలిచింది
తలవాకిట ప్రేమరథం
తలుపు తట్టి నిలిచింది
తలపోతల తీయదనం
తెలుసుకోను రమ్మoది
ఆమె
తొలి ఆశల చిలిపితనం
కమ్మని కబురంపింది
తొలి ఆశల చిలిపితనం
కమ్మని కబురంపింది
మలిసంధ్యల కుంకుమపెట్టి
పేరంటం పిలిచింది
అతడు
పదును కోరిక పెదవి గడపన
ఎదురు చూసేవేళ
ఆమె
పలకరింతకు పులకరింతలు
పురులు విరిసేవేళ
అ: ఆ... అ.. అ..ఆ..
ఆ: కలలెందుకూ...
అ: అ.. అ.. అ..
ఆ: కథలెందుకూ....
అ: అ.. అ.. అ..
ఆ: తలపెందుకూ...
అ: అ.. అ.. అ..
ఆ: తపమెందుకూ....
అ: ఓ...ఓ...ఓ...ఓ
అతడు
కొనచూపుల కలికితనం
విరులవాన కురిసింది
కొనచూపుల కలికితనం
విరులవాన కురిసింది
కరిగిపోని కాంతివనం
కోటి చిగురులేసింది
ఆమె
చిరునవ్వుల చల్లదనం
సిరుల వరము చిలికింది
చిరునవ్వుల చల్లదనం
సిరుల వరము చిలికింది
చెదిరిపోని చెలిమి ధనం
తీరని రుణమయ్యింది
అతడు
మలిగిపోని మమతలన్నీ
మదిని వెలిగేవేళ
ఆమె
పోతపోసిన పుణ్యమంతా
పున్నమయ్యే వేళ
ఆ: ఆ..అ..అ..అ..
అ: కలలెందుకూ...
ఆ: అ.. అ.. అ..
అ: కథలెందుకూ..
ఆ: అ.. అ..అ..
అ: తలపెందుకూ...
ఆ: అ.. అ.. అ..
అ: తపమెందుకు...
ఆ: అ.. అ.. అ..
అ: మ్ మ్ మ్ మ్ మ్
ఆ: అ.. అ.. అ..

0 కామెంట్‌లు