Idi evvaru evvariki ivvani veedukolu song lyrics in telugu | ఇది ఎవ్వరూ ఎవ్వరికి ఇవ్వని వీడుకోలు | Amma Rajanama |

 


చిత్రం : అమ్మ రాజీనామా (1991)
సంగీతం : K. చక్రవర్తి గారు
పాడినవారు : బాలు గారు
రచన : సిరివెన్నెల సీతారామశాస్త్రి గారు


పల్లవి :
ఇది ఎవ్వరూ 
ఎవ్వరికి ఇవ్వని వీడుకోలు
ఇవి ఎక్కడా 
ఎన్నడూ జరగని పంపకాలు
దేవతా తరలిపో
తల్లిగా మిగిలిపో
వదలలేక వదలలేక 
గుండె రాయి చేసుకొని
ఎవ్వరూ ఎవ్వరికి ఇవ్వని వీడుకోలు
చరణం : 1
పసి బిడ్డగా పుట్టి కూతురై పెరిగి
కోడలై భర్తకు భార్యయై బిడ్డకు తల్లియై
ఇల్లాలిగా తల్లిగా తల్లికి తల్లిగా
నవ్వునూ ఏడుపును కలిపి దిగమింగి
ఇంటినే గుడి చేసిన దేవతా
సెలవిమ్మని అడిగితే
ఇక సెలవిమ్మని అడిగితే
ఇది కనని వినని సంఘటనా
అపూర్వ సంఘటనా
ఇది ఎవ్వరూ
ఎవ్వరికి ఇవ్వని వీడుకోలు
ఇవి ఎక్కడా 
ఎన్నడూ జరగని పంపకాలు
‘‘నీ మోము చూడకముందే..
నీ స్వరం వినకముందే..
నీ గుణం తెలియకముందే..
నిన్ను నిన్నుగా ప్రేమించే
గొప్ప వ్యక్తి అమ్మ‘‘
చరణం : 2
భూమిపై పుట్టి బానిసై పెరిగి
దాసియై సేవకు నిలయమై 
ఆగని యంత్రమై
నిజములో..నిద్రలో ఇల్లే కళ్ళుగా
వయసును సుఖమును చితిగా వెలిగించి
బ్రతుకే హారతి ఇచ్చిన దేవతా
సెలవిమ్మని అడిగితే
ఇక సెలవిమ్మని అడిగితే
ఇది కనని వినని సంఘటనా
అపూర్వ సంఘటనా
ఇది ఎవ్వరూ 
ఎవ్వరికి ఇవ్వని వీడుకోలు
ఇవి ఎక్కడా 
ఎన్నడూ జరగని పంపకాలు
దేవతా తరలిపో
తల్లిగా మిగిలిపో
వదలలేక వదలలేక గుండె రాయి చేసుకొని
ఎవ్వరూ ఎవ్వరికి ఇవ్వని వీడుకోలు

కామెంట్‌ను పోస్ట్ చేయండి

0 కామెంట్‌లు