Enno Uhalo Enno Talupulu Song Lyrics in Telugu | ఎన్నో ఊహలు ఎన్నో తలపులు | మధుర స్వప్నం | తొలిముద్దున తొనికిన స్వప్నం | మురిపాల ముద్దుల మూటై | ఆచార్య ఆత్రేయ| బాలు, సుశీల|



చిత్రం : మధుర స్వప్నం (1982)
సంగీతం : సత్యం
గీతరచయిత : ఆచార్య ఆత్రేయ
నేపధ్య గానం :  బాలు, సుశీల


పల్లవి :
ఆమె
ఎన్నో ఊహలు ఎన్నో తలపులు ఎన్నో ఆశలు
అవి నేటికి నిజమై రేపటి వెలుగై ఎదలో మెదలెను
అతడు
ఎన్నో ఊహలు ఎన్నో తలపులు ఎన్నో ఆశలు
అవి నేటికి నిజమై రేపటి వెలుగై ఎదలో మెదలెను
ఆమె
మధుర స్వప్నం  మన మధుర స్వప్నం
అతడు 
మధుర స్వప్నం  మన మధుర స్వప్నం
చరణం1:
ఆమె
తొలిముద్దున తొనికిన స్వప్నం
నడిపొద్దున నలిగిన స్వప్నం
కలురెప్పల కౌగిళ్ళలో 
కలబోసిన కమ్మని స్వప్నం
అతడు: తొలిముద్దున 
ఆమె: తొనికిన స్వప్నం
అతడు:నడిపొద్దున 
ఆమె:నలిగిన స్వప్నం
అతడు: కలురెప్పల కౌగిళ్ళలో 
ఆమె:కలబోసిన కమ్మని స్వప్నం
ఆమె
నీలోన సగము నాలోన సగము
అతడు 
ఒకటైన రూపం మన ప్రేమ దీపం
ఆమె
ఎన్నో ఊహలు ఎన్నో తలపులు ఎన్నో ఆశలు
అతడు
అవి నేటికి నిజమై రేపటి వెలుగై ఎదలో మెదలెను
ఆమె
మధుర స్వప్నం మన మధుర స్వప్నం
అతడు 
మధుర స్వప్నం మన మధుర స్వప్నం
చరణం 2 :
అతడు 
మురిపాల ముద్దుల మూటై
విరబూచిన నవ్వుల తోటై
హృదయాల ఉయ్యాలలో 
ఎదిగొచ్చే అల్లరి ఆటై 
ఆమె: మురిపాల 
అతడు: ముద్దుల మూటై
ఆమె: విరబూచిన 
అతడు: నవ్వుల తోటై
ఆమె: హృదయాల ఉయ్యాలలో 
అతడు: ఎదిగొచ్చే అల్లరి ఆటై 
అతడు
తొలి జోల పాటై...  మన కంటి పాపై
ఆమె:
నడయాడు బాబు...  పుడతాడు రేపు
అతడు
ఎన్నో ఊహలు ఎన్నో తలపులు ఎన్నో ఆశలు
ఆమె:
అవి నేటికి నిజమై రేపటి వెలుగై ఎదలో మెదలెను
ఇద్దరు 
మధుర స్వప్నం మన మధుర స్వప్నం
మధుర స్వప్నం మన మధుర స్వప్నం
మధుర స్వప్నం మన మధుర స్వప్నం
మధుర స్వప్నం మన మధుర స్వప్నం

కామెంట్‌ను పోస్ట్ చేయండి

0 కామెంట్‌లు