ఏమని వ్రాయనూ | పెద్దలు మారాలి | నింగిలోన తారలున్నా | ఏ కలనైనా నీవే | సినారె | సుశీల, బాలు | best old songs lyrics in telugu | male female lyrics in telugu |

 



చిత్రం :  పెద్దలు మారాలి (1974)

సంగీతం :  బి. గోపాలం

గీతరచయిత :  సినారె

నేపధ్య గానం :  సుశీల, బాలు 


పల్లవి :

అతడు 

ఏమని వ్రాయనూ?

ఏమని వ్రాయనూ?

ఇంకేమని వ్రాయనూ?

ఏమని వ్రాయనూ?

ఏమని వ్రాయనూ?

ఏమని వ్రాయనూ?

ప్రతి పలుకూ విరహగీతమై

పరవశింప జేస్తుంటే

ఆమె

ఏమని వ్రాయనూ?

ఏమని వ్రాయనూ?

ప్రతి పలుకూ నీ రూపమై

పలకరించి పోతుంటే

ఏమని వ్రాయనూ?

చరణం 1:

అతడు 

నింగిలోన తారలున్నా

నీ కనుపాపలే కనిపించగా

నింగిలోన తారలున్నా

నీ కనుపాపలే కనిపించగా

తోటలోన పూలెన్ని ఉన్నా

తోటలోన పూలెన్ని ఉన్నా

నీ సిగమల్లెలే కవ్వించగా

ఏమని వ్రాయనూ?

చరణం 2 

ఆమె

మొదటి రేయి మూగహాయి

ఎదలో ఇంకా పులకించగా

మొదటి రేయి మూగహాయి

ఎదలో ఇంకా పులకించగా

పిదప పిదప పెరిగిన మమతా

పిదప పిదప పెరిగిన మమతా

వేయింతలుగా వికసించగా

ఏమని వ్రాయనూ?

చరణం 3 :

అతడు 

ఏ కలనైనా నీవే.. నీవే.

నా కౌగిలిలో నిదురించగా

ఆమె

అన్ని వేళలా నీవే.. నీవే.. 

నా కన్నులలో నివసించగా

అతడు 

ఏమని వ్రాయనూ

ఏమని వ్రాయనూ

ప్రతి పలుకూ విరహగీతమై

పరవశింప జేస్తుంటే

ఆమె

ప్రతి పలుకూ నీ రూపమై.. 

పలకరించి పోతుంటే..  

అతడు: పరవశింప జేస్తుంటే.. 

ఆమె: పలకరించి పోతుంటే...  

అతడు: పరవశింప జేస్తుంటే.. 

ఆమె: పలకరించి పోతుంటే...  

అతడు: పరవశింప జేస్తుంటే.. 

ఆమె: పలకరించి పోతుంటే...

కామెంట్‌లు లేవు:

కామెంట్‌ను పోస్ట్ చేయండి