Uppungele Godavari Song Lyrics in Telugu | ఉప్పొంగెలే గోదావరీ | సావాసాలు సంసారాలు | గోదారమ్మ కుంకంబొట్టు | Gadavari movie songs lyrics in telugu
ఉప్పొంగెలే గోదావరీ
Movie Title:-Godavari
Cast Crew:-Sumanth, Kamalinee Mukharjee
Music:-K.M.Radha Krishnan
Director:-Shekar Kamuula
Language:-Telugu
Year:-2006
ఆలాపన:
షడ్యమాం భవతి వేదం..
పంచమాం భవతి నాదం..
శృతి శిఖరే..నిగమజనే.. స్వరలహరీ..
సాస పాపపప పమరిస సనిస
సాస పాపపప పమదప ప
సాస పాపపప పమరిస సనిస
సాస పాపపప పమదప ప
పల్లవి:
ఉప్పొంగెలే గోదావరీ
ఊగిందిలే చేలోవరి
భూదారిలో నీలాంబరీ
మా సీమకే చీనాంబరి..
వెదలు తీర్చు మా దేవేరి
వేదమంటి మా గోదారి..
శబరి కలిసిన గోదారీ
రామ చరితకే పూదారి
వేసై చాప తోసై నావ బార్సై వాలుగా..
చుక్కానే చూపుగా..
బ్రతుకుతెరువు ఎదురీతేగా..
ఉప్పొంగెలే గోదావరీ
ఊగిందిలే చేలోవరి
భూదారిలో నీలాంబరీ
మా సీమకే చీనాంబరీ..
చరణం 1:
సావాసాలు సంసారాలు
చిలిపి చిలక జోస్యం..
వేసే అట్లు వేయంగానె
లాభసాటి బేరం..
ఇళ్ళే ఓడలైపోతున్న
ఇంటి పనుల దృశ్యం
ఆరేసేటి అందాలన్ని
అడిగే నీటి అద్దం..
ఏం తగ్గింది మా రామయ్య భోగం ఇక్కడ..
నది ఊరేగింపులో..
పడవమీద రాగా..
ప్రభువు తాను కాగా..
ఉప్పొంగెలే గోదావరీ
ఊగిందిలే చేలోవరి
భూదారిలో నీలాంబరీ
మా సీమకే చీనాంబరి..
చరణం 2:
గోదారమ్మ కుంకంబొట్టు
దిద్దె మిరప ఎరుపు..
లంకానాధుడింటా
ఆగనంటు పండు కొరుకు..
చూసే చూపు ఏం చెప్పింది
సీతా కాంతకీ..
సందేహాల మబ్బే పట్టె
చూసే కంటికీ..
లోకం కాని లోకం లోన
ఏకాంతాల వలపు..
అల పాపికొండలా..
నలుపు కడగలేక..
నవ్వు తనకు రాగా..
ఉప్పొంగెలే గోదావరీ
ఊగిందిలే చేలోవరి
భూదారిలో నీలాంబరీ
మా సీమకే చీనాంబరి..
వెదలు తీర్చు మా దేవేరి
వేదమంటి మా గోదారి..
శబరి కలిసిన గోదారీ
రామ చరితకే పూదారి
వేసై చాప తోసై నావ బార్సై వాలుగా..
చుక్కానే చూపుగా..
బ్రతుకుతెరువు ఎదురీతేగా..
ఉప్పొంగెలే గోదావరీ
ఊగిందిలే చేలోవరి
భూదారిలో నీలాంబరీ
మా సీమకే చీనాంబరీ..
కామెంట్‌లు లేవు:
కామెంట్‌ను పోస్ట్ చేయండి
కొత్త పోస్ట్
పాత పోస్ట్
హోమ్
దీనికి సబ్స్క్రయిబ్ చేయి:
కామెంట్లను పోస్ట్ చేయి (Atom)
కామెంట్‌లు లేవు:
కామెంట్‌ను పోస్ట్ చేయండి