పంపర పనసరో - తెలుగు లిరిక్స్
Music Director - Kartik Yadagiri
Singers - Kartika Jadhav, Karthik Yadagiri
Lyrics - Chandu Kandrathi
పల్లవి:
వెన్నెలో వెన్నెలా
నా మనసంత వాడేగా
వెన్నెలో వెన్నెలా
నీనంటే వాడేగా
కళ్ళలో చూడు గుండెలో చూడు
ప్రేమతో నిండిపోయాగా
కళ్ళలో చూడు గుండెలో చూడు
ప్రేమతో నిండిపోయాగా
నీ మీద నా ప్రేమను ఎట్టా చెప్పాలి
నాలోని ఈ ప్రేమను ఎట్టా దాచాలని
సతమతమవుతున్నా.. సగమైపోతున్నా
వెన్నెలో వెన్నెలా నా మనసంత వాడేగా
వెన్నెలో వెన్నెలా నీనంటే వాడేగా
చరణం 1:
నా నుదుట కుంకుమ బొట్టు నువ్వే దిద్దాలి
నా కంటి కాటుక తోటి చుక్కే పెట్టాలి
ఏదో ఆశరా ఎట్టా తీరురా
ఏదో ఆశరా ఎట్టా తీరురా
కన్నె మనసే కోరుకునేటి పెనిమిటి వాడేగా
ఏనాటికైనా వాడితో నడిచే రోజే రావాలిగా
నీ మీద నా ప్రేమనీ ఎట్టా చెప్పాలని
నాలోని నీ ప్రేమనీ ఎట్టా దాచాలని
సతమతమవుతున్నా..
సగమైపోతున్నా
సతమతమవుతున్నా..
సగమైపోతున్నా
వెన్నెలో వెన్నెలా..
నా మనసంత వాడేగా
వెన్నెలో వెన్నెలా..
నీనంటే వాడేగా
చరణం 2:
ఏడేడు కాలాలు కలిసే ఉండాలి
నీ చేతి గీతల్లోనా నేనే ఉండాలి
ఏదో ఆశరా.. నీదే ధ్యాసరా
ఏదో ఆశరా.. నీపై శ్వాసరా
ఊపిరంత ఊసుల తోటి నిండే నీ కోసం
నువ్వు నన్ను కాదంటే కను మరుగే ఈ జన్మ
నీ మీద నా ప్రేమనీ ఎట్టా చెప్పాలని
నాలోని నీ ప్రేమనీ ఎట్టా దాచాలని
సతమతమవుతున్నా..
సగమైపోతున్నా
సతమతమవుతున్నా..
సగమైపోతున్నా
వెన్నెలో వెన్నెలా
నా మనసంత వాడేగా
వెన్నెలో వెన్నెలా
నీనంటే వాడేగా
వెన్నెలో వెన్నెలా
నా మనసంత వాడేగా
వెన్నెలో వెన్నెలా
నీనంటే వాడేగా
This lyrics are for educational and promotional purposes only.
All rights belong to the respective owners.