Nindu nindu nimmalo folk song lyrics in telugu | telugu folk songs lyircs | నిండు నిండు నిమ్మలో



NINDU NINDU NIMMALO - FLOK SONG



Song Title: నిండు నిండు నిమ్మలో 
(Folk Song 2026)

Singers: Kavitha, Mikky Mohan



కోరస్ 

ఓ సూపన్న సూడవేరో

సూసన్న నవ్వవేరో

ఓ సూపన్న సూడవేరో 

సూసన్న నవ్వవేరో


నిండు నిండు నిమ్మలు.. నిమ్మలు  ఓరి పిల్లగా 

నిండు నిమ్మ తొవ్వలు.. తొవ్వలు  ఓరి పిల్లగా

నిండు నిమ్మ తొవ్వలు తొవ్వలు  ఓరి పిల్లగా

నిమ్మలంగ జూసినవ్ జూసినవ్  ఓరి పిల్లగా 

నీ ముదురీపిచ్చి మాటలే ఓ లాలి లాలమ్మ

బుట్టిగ గుండె లాగెనే ఓ లాలి లాలమ్మ

నీ ఉరుకులాడె సూపులే ఓ లాలి లాలమ్మ

అట్టిగ పొర్లేసెనే ఓ లాలి లాలమ్మ

మాటన్న వినవేరో మనసనగన వేరో

మాటన్న వినవేరో మనసనగన వేరో


కోరస్ 

ఓ సూపన్న సూడవేరో

సూసన్న నవ్వవేరో

ఓ సూపన్న సూడవేరో

సూసన్న నవ్వవేరో


ఒడి సెల సేత వట్టుకొని వట్టుకొని ఓరి పిల్లగా

సేను గట్టు దాటుకొని దాటుకొని

బరి సేను గట్టు దాటుకొని పోతవుంటే ఓరి పిల్లగా

వడ్డున నీ దారిగాస్తి దారిగాస్తి 

మనసు కోరు మంట గలువ ఓ లాలి లాలమ్మ

మనిషినైతే లేను గింత ఓ లాలి లాలమ్మ

వాని కోర మీసం కొంటె నవ్వు ఓ లాలి లాలమ్మ

కొట్లాటవెట్టె గుండె నిండ ఓ లాలి లాలమ్మ

మాటన్న వినవేరో మనసనగన వేరో

మాటన్న వినవేరో మనసనగన వేరో


కోరస్ 

ఓ సూపన్న సూడవేరో

సూసన్న నవ్వవేరో

ఓ సూపన్న సూడవేరో

సూసన్న నవ్వవేరో


కునుకు లేదు కుదురు లేదు ప్రాణము ఓరి పిల్లగా

కూసున్న నిలుసున్న నీదే ధ్యాసరో

కూసున్న నిలుసున్న నీదే ధ్యాసరో ఓరి పిల్లగా

ఎదురు పడితే మనసు నిండ నిమ్మలం

ఒంటిగుంటె సల్లగుండ ఓ లాలి లాలమ్మ

జంట సేరె కలల మూట ఓ లాలి లాలమ్మ

పది మందిలున్న తలుసుడు  ఆప ఓ లాలి లాలమ్మ

కాలంగా గుండెలో దాస ఓ లాలి లాలమ్మ

మాటన్న వినవేరో మనసనగన వేరో

మాటన్న వినవేరో మనసనగన వేరో


కోరస్ 

ఓ సూపన్న సూడవేరో

సూసన్న నవ్వవేరో

ఓ సూపన్న సూడవేరో

సూసన్న నవ్వవేరో


 

బుదార గిస్తూ బువ్వ పెడుతో ఉండదు ఓరి పిల్లగా 

ఎదకి హత్తుకొని ఎత్తుకొని మురిసినట్టు  

ఎదకి హత్తుకొని ఎత్తుకొని మురిసినట్టు ఓరి పిల్లగా 

కలలు గంటి మూరిసిన మూరిసినవ్  ఓరి పిల్లగా 

మనసంతా మనువు ముచ్చటటా ఓ లాలి లాలమ్మ 

మునుపు లేని సంబరం ఓ లాలి లాలమ్మ 

ఏడాడుగులు లేసే బంధమే ఓ లాలి లాలమ్మ 

నీ యంట నాడుసి నట్టునే ఓ లాలి లాలమ్మ 

మాటన్న వినవేరో మనసనగన వేరో

మాటన్న వినవేరో మనసనగన వేరో

కోరస్ 

ఓ సూపన్న సూడవేరో

సూసన్న నవ్వవేరో

ఓ సూపన్న సూడవేరో

సూసన్న నవ్వవేరో


వెన్నెలో వెన్నెలా పాట సాహిత్యం


This lyrics are for educational and promotional purposes only.

All rights belong to the respective owners.



కామెంట్‌ను పోస్ట్ చేయండి

0 కామెంట్‌లు