Raguluthunnadi Delhi Nagaram Song Lyrics in Telugu | Nirbhya Bharatham Movie Songs Lyircs in Telugu

రగులుతున్నది డిల్లీ నగరము - నిర్భయ భారతం


Vandemataram Srinivas

Music Director : R.Narayana Murthy
Cast : R.Narayana Murthy, Nanci, Spandana


ఆ... రగులుతున్నది డిల్లీ నగరము రా యేసుడా రారా

కదులుతున్నది యువత రంగము లే యేసుడా లేరా

రగులుతున్నది డిల్లీ నగరము రా యేసుడా రారా

కదులుతున్నది యువత రంగము లే యేసుడా లేరా

అరే గాంధీ పుట్టిన దేశంలోన మగువల మానం మంటగలిసెరా

రాజధాని నడిబొడ్డు మీదనే రౌడీ మూకలు రెచ్చిపోయరా

(రౌడీ మూకలు రెచ్చిపోయరా

రౌడీ మూకలు రెచ్చిపోయరా)


అరెరెరెరెరె హా...

పాపము శుభము తెలియని బిడ్డను రా యేసుడా రారా

బస్సులోనే మానభంగం చేసిరి లే యేసుడా లేరా

రగులుతున్నది డిల్లీ నగరము రా యేసుడా రారా

కదులుతున్నది యువత రంగము లే యేసుడా లేరా

కదులుతున్నది యువత రంగము లే యేసుడా లేరా


చార్మినారుకు సలాము కొట్టి

ఇండియ గేటుకు హిమ్మతి తెలిపి

లాఠీలిరిగినా లడాయి మానక

తూటా పేలినా తడాఖా చూపి

(తూటా పేలినా తడాఖా చూపి

తూటా పేలినా తడాఖా చూపి)

అరెరెరెరెరె హా...

అరె జంతరు మంతరు జగడమాడెరా రా యేసుడా రారా

ఎర్రకోటపై ఎగబడుతున్నారు లే యేసుడా లేరా

రగులుతున్నది డిల్లీ నగరము రా యేసుడా రారా

కదులుతున్నది యువత రంగము లే యేసుడా లేరా

కదులుతున్నది యువత రంగము లే యేసుడా లేరా


అరె కన్న బిడ్డలకు న్యాయం జరగక

కాలే కడుపులు కదం తొక్కెరా

మానవత్వమే మంటగలిసెనని

మహిళా లోకం మర్లబడ్డదే

(మహిళా లోకం మర్లబడ్డదే

మహిళా లోకం మర్లబడ్డదే)


అరెరెరెరెరె హా...

అబ్బర పులులే దబ్బ దరిచెను రా యేసుడా రారా

దబ్బున లేచి దెబ్బ కొట్టరా లే యేసుడా లేరా

రగులుతున్నది డిల్లీ నగరము రా యేసుడా రారా

కదులుతున్నది యువత రంగము లే యేసుడా లేరా

కదులుతున్నది యువత రంగము లే యేసుడా లేరా


కోట్ల గొంతులు ఒక్కటైనవి పార్లమెంటునే ప్రశ్నిస్తున్నవి

నిర్భయ తల్లికి అండగ నిలిచి దేశం మొత్తం దద్దరిల్లెరా

(దేశం మొత్తం దద్దరిల్లెరా

దేశం మొత్తం దద్దరిల్లెరా)

అరెరెరెరెరె హా...

జనం గుండెలే జెండై ఎగిసెరా రా యేసుడా రారా

డిల్లీ పెద్దలా గద్దె లొనికెరా లే యేసుడా లేరా

రగులుతున్నది డిల్లీ నగరము రా యేసుడా రారా

కదులుతున్నది యువత రంగము లే యేసుడా లేరా

కదులుతున్నది యువత రంగము లే యేసుడా లేరా


ఆ... ఆ... జన క్షేత్రమే జంగు సైరనై

కురుక్షేత్రమే యుద్ధ రంగమై

ఉడికిన నెత్తురు ఉరకలేసెరా

ఉద్యమానికే ఊపిరి పోసెరా

(ఉద్యమానికే ఊపిరి పోసెరా

ఉద్యమానికే ఊపిరి పోసెరా)

అరెరెరెరెరె హా...

ఆ యువత దెబ్బకు దిమ్మ తిరిగెరా రా యేసుడా రారా

అడిగిన షరతులు అమలు చేసెరా లే యేసుడా లేరా

రగులుతున్నది డిల్లీ నగరము రా యేసుడా రారా

కదులుతున్నది యువత రంగము లే యేసుడా లేరా

అడిగిన షరతులు అమలు చేసెరా లే యేసుడా లేరా

అడిగిన షరతులు అమలు చేసెరా లే యేసుడా లేరా



కామెంట్‌ను పోస్ట్ చేయండి

0 కామెంట్‌లు