Mangli Bayilone Ballipalike Song Lyrics in Telugu | Suresh Bobbili | Nagavva | KamalEslavath |ShekarVirus | DamuReddy | బాయిలోనే బల్లిపలికే




సాంగ్
: బాయిలోనే బల్లిపలికే
దర్శకుడు దాము రెడ్డి
గాయకులుమంగ్లీ & నాగవ్వ
సంగీతంసురేష్ బొబ్బిలి
కొరియోగ్రాఫర్శేఖర్ వైరస్
గీత రచయితకమల్ ఎస్లావత్


బాయిలోనే బల్లిపలికే
బాయిలోనే బల్లిపలికే
బండసారం శిలలొదిలే బాయిలోనే
ఎర్రాని మావొల్ల శేతికి
ఎర్రాని మావొల్ల శేతికి
ఏడువేలా జోడుంగురాలో ఎర్రాని
గుండ్లు గున్నాలు ఆ శెంపశేర్లు
ఇంపుగ శింగారించుకోని
సన్నా సన్నాని జాజులు సందేల
మోజుగ ముడుసుకోనొస్తిని
బాయి బాటెంట బంతిపువ్ తోటెంట
పిలగా నీ తోడ సిద్ధమై వస్తిరా
బాయిలోనే…
బాయిలోనే బల్లిపలికే
బాయిలోనే బల్లిపలికే
బండసారం శిలలొదిలే బాయిలోనే
బాజరులా బాలలంత
బాజరులా బాలలంత
బత్తిసా లాడంగో బాజరులా
శింతా శింతల్ల శింతపువ్వు రాలంగ
సిన్నోడ నా శెయ్యి పట్టవేమిర
ముంతా ముంతల్ల ఈతకల్లు తాగినట్టు
పానమంత నీ దిక్కె గుంజుతుందిరా
ఏగిరం లేకుండా ఇద్దరం ఇగురంగా
ఇష్టంగా ఎగిరిపోదామా
పాయిరం జంటోలే గావురం జేసుకొను
ముహూర్త బలమే అడుగుదమా
కంచె దాటంగ మంచే మీదుంగ ముద్దు
ముచ్చట్ల మునిగిపోదమా
బాయి బాయి బాయి బాయి బాయిలోనే
బాయిలోనే బల్లిపలికే
బాయిలోనే బల్లిపలికే
బండసారం శిలలొదిలే బాయిలోనే
వాడకట్టు ఆడోళ్లంతా
ఆడకట్టు ఆడోళ్లంతా
సూడమెచ్చే సంబురాలో వాడకట్టు
సందు సందుల్ల మందీ మందీల
సైగలు జెయ్యంగ సూడవేమిర
ఎన్ని దినాలు నువ్వే పానాలు
అంటు నిన్నే తలువనురా
పొడిపొడి మాటల పోరడ
నీకాడ జేరగ పట్టు వడితినిరా
పరులా కన్నూల పడక
నీ కొరకు పరుగు పరుగన వస్తినిరా
అలిమిన శీకట్ల బలిమిలేకుండా
ఆలుపు సొలుపులు తీర్చవేమిరా
బాయి బాయి బాయి బాయి బాయిలోనే
బాయిలోనే బల్లిపలికే
బాయిలోనే బల్లిపలికే
బండసారం శిలలొదిలే బాయిలోనే
కంకపొదలా కొమ్మలిరిశి
కంకపొదలా కొమ్మలిరిశి
కొలాటా లాడంగో కంకపొదలా
గుండ్లు గున్నాలు ఆ శెంపశేర్లు
ఇంపుగ శింగారించుకోని
సన్నా సన్నాని జాజులు సందేల
మోజుగ ముడుసుకోనొస్తిని
బాయి బాటెంట బంతిపువు తోటెంట
పిలగా నీ తోడ సిద్ధమై వస్తిరా
బాయిలోనే

కామెంట్‌ను పోస్ట్ చేయండి

0 కామెంట్‌లు