Padukunte Nakedo Lyrical Song in Telugu | Rp patnaik Song Lyrics in Telugu


Song -
Padukunte Nakedo
Lyrics - Sri Nanduri Subbarao
Singer & Composer - RP Patnaik

 

పల్లవి:
పడుకుంటే నాకేటో భ్రమ పుట్టినాది
కడుపులో సెయ్యేసి కలిపేసినాది
పడుకుంటే నాకేటో భ్రమ పుట్టినాది
కడుపులో సెయ్యేసి కలిపేసినాది
చరణం 1:
ఎడతెగని జలమంట నడుమనో పడవంట
ఎడతెగని జలమంట నడుమనో పడవంట
పడవెక్కి నా ఎంకి పయనమై ఏందంట
పయనమై ఏందంట...
ఎంకేటో భ్రమపుట్టి ఎనకాతిరిగిందంట
ఎంకేటో భ్రమపుట్టి ఎనకాతిరిగిందంట
సందేగాలికి పడవ సాగిపోయిందంట
సాగిపోయిందంట
పడుకుంటే నాకేటో భ్రమ పుట్టినాది
కడుపులో సెయ్యేసి కలిపేసినాది
చరణం 2:
నీటి గాలికి ఎంకి పైటెగురుతాదంట
నీటి గాలికి ఎంకి పైటెగురుతాదంట
పడపోయినట్టేటో పడవెళ్ళినాదంట
పడవెళ్ళినాదంట...
పిల్లా సిగలో పూలు కళ్ళిప్పినాయంట
పిల్లా సిగలో పూలు కళ్ళిప్పినాయంట
మిడిసిపాటున దోనె మీరిపోయిందంట
దోనె మీరిపోయిందంట...
పడుకుంటే నాకేటో భ్రమ పుట్టినాది
కడుపులో సెయ్యేసి కలిపేసినాది
చరణం 3:
మెడసాటు పూసోటి మినుకుమంటాదంట
మెడసాటు పూసోటి మినుకుమంటాదంట
పంతాన గంతేసి పడవపోయిందంట
పడవపోయిందంట...
హంసల్లే బొమ్మల్లే అందాల భరిణల్లే
హంసల్లే బొమ్మల్లే అందాల భరిణల్లే
సుక్కల్లే నా ఎంకి సురిగిపోయిందంట
సురిగిపోయిందంట...
ముగింపు:
పడుకుంటే నాకేటో భ్రమ పుట్టినాది
కడుపులో సెయ్యేసి కలిపేసినాది
పడుకుంటే నాకేటో భ్రమ పుట్టినాది
కడుపులో సెయ్యేసి కలిపేసినాది
కడుపులో సెయ్యేసి కలిపే
సినాది...
కడుపులో సెయ్యేసి కలిపేసినాది...
కడుపులో సెయ్యేసి కలిపేసినాది...

కామెంట్‌ను పోస్ట్ చేయండి

0 కామెంట్‌లు