SEETHAKU TAPPALEDHE SRIRAMUDITHO DOORAM SONG LYRICS IN TELUGU | NEW FOLK SONG LYRICS IN TELUGU | సీతకే తప్పలేదే శ్రీరాముడి తో దూరం

సీతకే తప్పలేదే శ్రీరాముడి తో దూరం


LYRICS – CHANDRA PRAKASH CHARY MUSIC -KALYAN KEYS SINGERS - HANUMANTH YADAV S. RAGHAVI S. NIKITHA




మాటిచ్చినాడమ్మా  అయినోడు... 
కట్టెకాలే వరకు చూడబోనని...
కాళ్ళు మొక్కినాడు కన్నోడు... 
కష్టాల మెడల పరువు చూసుకుని...
లోకాల బాధకు సీతమ్మని  వదిలి... 
గుండె పగిలినా శ్రీరాముడెళ్ళి...
కరడీవీకే నిన్ను పంపుతున్నాడే... 
కరడీవీకే నిన్ను పంపుతున్నాడే...
సీతకే తప్పలేదే శ్రీరాముడి తో దూరం... 
సిక్కుల్లో సుట్టుకుందని ప్రేమకు లేదే బలం...
తల్లి పేగు నంటుకున్న 
పసికందు ప్రసవ వేదం... 
పట్టలేని బరువు మోస్తూ 
గుండెల్లో క్షణ క్షణం...
కన్నప్రేమ అడ్డుకున్నదా ఇష్టంగా... 
కళ్ళల్లోన ప్రేమ దాచకే మౌనంగా...
జ్ఞాపకం మండుతున్నదా కారంగా... 
ఊసులే ఊపిరాయెనా ప్రాణంగా...
ఓగి ఓగి ఉయ్యాలా... 
ఆగేనేమో ఇయ్యాలా... 
సావుడప్పు మోగుతుందే సుట్టు నాకిలా...
ఆగి ఆగి చూడకలా ... 
తప్పిపోయే కంటిపాపలా... 
ఆగిపోతదేమో గుండె ఇప్పుడే ఇలా...
తెలిసే నా ఈ బాధకు తప్పే నాదని... 
తెలిసి అంటించుకున్న చితికి మంటని...
ఎళ్ళి ఎళ్ళి పోతా ఉన్నదే నా తల్లి... 
ఏడవకుండా ఎట్టా ఆపనే నీ బాధే... 
ఎళ్ళి ఎళ్ళి పోతా ఉన్నదే నా తల్లే...
ఏడవకుండా ఎట్టా ఆపనే నీ బాధే... 
ఉండి ఉండి ఉలికి పడి... 
ఊపిరంత లాగేసినట్టు... 
మాట తడి ఆవిరయ్యే గొంతు లోపల...
ఒక్కరోజు ఊరే వెళితే... 
తట్టుకోని ప్రేమే మనది... 
జన్మంతా దూరం అంటే ఎట్టా మోసేది...
ఊర్మిళను విడిచి వచ్చే లక్ష్మణుడైనా... 
రాధ బాధ చూడలేని కృష్ణుడయినా...
దేవుడే దీనుడుగా ఏడ్చాడే ప్రేమ కోసం.. 
అశనిండి కన్నీళ్లతో చూడకే నువు నా కోసం 
దేవుడే దీనుడుగా ఏడ్చాడే ప్రేమ కోసం.. 
అశనిండి కన్నీళ్లతో చూడకే నువు నా కోసం 

కామెంట్‌ను పోస్ట్ చేయండి

0 కామెంట్‌లు