Addam Mundhu | Bhartha Mahasayulaku Wignyapthi | ఆ అద్దం ముందు నిలబడి | Raviteja, Dimple Hayanthi | bheems ceciroeo| చల్లా గాలి కావాలంటే చందమామను తీసుకొస్తాడే

 


పల్లవి:

ఆమె

హే చల్లా గాలి కావాలంటే చందమామను తీసుకొస్తాడే

సన్నాజాజి కావాలంటే సంత మొత్తం మోసుకొస్తాడే

అడిగింది అందిస్తాడే అంతకుమించింది తెచ్చిస్తాడే

కోరింది తీరుస్తాడే వేరే కోరిక నాకింకా లేకుండా చేస్తాడే

ఆ అద్దం ముందు నిలబడి అబద్ధం చెప్పలేనే

నా అద్దం అంటే నువ్వే మరి ఏ నిజం దాచలేనే

ఆ అద్దం ముందు నిలబడి అబద్ధం చెప్పలేనే

నా అద్దం అంటే నువ్వే మరి ఏ నిజం దాచలేనే


చరణం 1:

అతడు 

నీకు నచ్చిన సంగీతం ఏంటి

ఆమె

నీ చెప్పుల సవ్వడి

అతడు

నువ్వు మెచ్చిన నగలు ఏంటి

ఆమె

మెడ వంపున ముద్దు తడి

అతడు

నీకిష్టమైన చోటు ఏంటి

ఆమె

అది చల్లని నీ ఒడి

అతడు

నువ్వు కోరుకున్నదొస్తులేంటి

ఆమె

నీ విచ్చని కౌగిలి

మళ్ళీ విచ్చని కౌగిలి

నా ఇష్టాలేవైనా నీతోనే మొదలయ్యేగా

నువ్వు తప్ప ఇంకేవైనా నా కంటికి కనిపించునా


ఓయ్... అద్దం ముందు నిలబడి అబద్ధం చెప్పలేనే

నా అద్దం అంటే నువ్వే మరి ఏ నిజం దాచలేనే

అద్దం ముందు నిలబడి అబద్ధం చెప్పలేనే

నా అద్దం అంటే నువ్వే మరి ఏ నిజం దాచలేనే


చరణం 2:

ఆమె

హే నీకు నచ్చిన పరిమళమేంటి

అతడు

నీ ఒళ్ళే నిలువెల్లా

ఆమె

నువ్వు మెచ్చిన పెయింటింగ్ ఏంటి

అతడు

ఉందే కంటిన బొట్టు బిళ్ళ

ఆమె

నువ్వు రోజు చదివేదేంటి

అతడు

నీ పరువాల పత్రికని

ఆమె

నువ్వు చూడొద్దనుకున్నదేంటి

అతడు

నీ కన్నుల నీటిని

ఏలి కన్నుల నీటిని

ఎవ్వరి ప్రాణాలు వాళ్లు చూసే వీలే లేదు

కానీ నా పంచ ప్రాణాల రూపాన్ని నీలో చూస్తున్నా

అతడు

ఏ అద్దం ముందు నిలబడి అబద్ధం చెప్పలేనే

నా అద్దం అంటే నువ్వే మరి ఏ నిజం దాచలేనే

ఆమె

అద్దం ముందు నిలబడి అబద్ధం చెప్పలేనే

నా అద్దం అంటే నువ్వే మరి ఏ నిజం దాచలేనే

మణికంఠ నామం అయ్యప్ప సాంగ్ లిరిక్స్ | ఆ హరి నామం ఆ శివ నామం | అమ్మ ఒడి వదిలి | మాలలోన ఎంతటి | అయ్యప్ప స్వామి సాంగ్స్ లిరిక్స్ తెలుగు లో | నల్లగొండ గద్దర్ సాంగ్ | బులెట్ బండి లక్ష్మణ్ |


చిత్రం/ఆల్బమ్: ప్రైవేట్ సాంగ్ (ఫోక్)

గానం: బులెట్ బండి లక్ష్మణ్ (Bullet Bandi Laxman)

సాహిత్యం: నల్గొండ గద్దర్ (Nalgonda Gaddar)

మణికంఠ నామం అయ్యప్ప సాంగ్ లిరిక్స్ (Manikanta Naamam Ayyappa Telugu Lyrics)

పులకించని మది పులకించు | రాగమందనురాగ | వాడిపోయిన పైరులైనా | పెళ్లి కనుక | ఆచార్య ఆత్రేయ | జిక్కి గారి సోలో సాంగ్స్ |

 


చిత్రం : పెళ్లి కనుక  (1960)

సంగీతం :  ఏ.ఎం. రాజా

రచన :  ఆచార్య ఆత్రేయ

గానం :  జిక్కి


పల్లవి :

పులకించని మది పులకించు

వినిపించని కథ వినిపించు

అనిపించని ఆశల వించు

మనసునే మరపించు గానం

పులకించని మది పులకించు

వినిపించని కథ వినిపించు

అనిపించని ఆశల వించు

మనసునే మరపించు గానం

మనసునే మరపించు


చరణం : 1

రాగమందనురాగ మొలికి రక్తి నొసగును గానం

రాగమందనురాగ మొలికి రక్తి నొసగును గానం

రేపు రేపను తీపి కలలకు రూపమిచ్చును గానం

చెదరిపోయే భావములను చేర్చికూర్చును గానం

జీవమొసగును గానం మది చింతబాపును గానం


చరణం : 2

వాడిపోయిన పైరులైనా 

నీరుగని నర్తించును

వాడిపోయిన పైరులైనా 

నీరుగని నర్తించును

కూలిపోయిన తీగలైనా 

కొమ్మనలికి ప్రాకును

కన్నె మనసు ఎన్నుకున్న 

తోడు దొరికిన మదిలో

దోరవలపే కురియు... 

మదీ దోచుకొనుమని పిలుచు

పులకించని మది పులకించు 

వినిపించని కథ వినిపించు

అనిపించని ఆశల నించు 

మనసునే మరపించు

ప్రేమా... మనసునే మరపించు

మంచిని మరచి వంచన నేర్చి| అందరి చెమట చిందించాడు | ఒకే కుటుంబం| ఘంటసాల | ఎస్.పి. కొత్వండపాణి |

 చిత్రం: ఒకే కుటుంబం

గానం: ఘంటసాల

సంగీతం: ఎస్.పి. కొత్వండపాణి

సాహిత్యం: దాశరథి కృష్ణమాచార్యులు

నటీనటులు: ఎన్.టి.ఆర్, లక్ష్మి

స్వాముల సేవకు వేళాయె | ఎన్ని తీర్థములు సేవించారో | ఏయే వేళలకేమి ప్రియములో | శ్రీకృష్ణార్జునయుద్ధం | పెండ్యాల | పింగళి | సుశీల | ఫేమలే సోలో సాంగ్స్ లిరిక్స్



చిత్రం :  శ్రీకృష్ణార్జునయుద్ధం (1963)

సంగీతం :  పెండ్యాల

గీతరచయిత :  పింగళి

నేపధ్య గానం :  సుశీల


ఒకరి మనసు ఒకరికి ఏనాడో తెలుసులే | నిండు సంసారం | మాస్టర్ వేణు | సుశీల, ఘంటసాల



చిత్రం : నిండు సంసారం (1968) 
సంగీతం : మాస్టర్ వేణు
గీతరచయిత : దాశరథి
నేపథ్య గానం : సుశీల, ఘంటసాల 

ఏమని వ్రాయనూ | పెద్దలు మారాలి | నింగిలోన తారలున్నా | ఏ కలనైనా నీవే | సినారె | సుశీల, బాలు | best old songs lyrics in telugu | male female lyrics in telugu |

 



చిత్రం :  పెద్దలు మారాలి (1974)

సంగీతం :  బి. గోపాలం

గీతరచయిత :  సినారె

నేపధ్య గానం :  సుశీల, బాలు 

Enno Uhalo Enno Talupulu Song Lyrics in Telugu | ఎన్నో ఊహలు ఎన్నో తలపులు | మధుర స్వప్నం | తొలిముద్దున తొనికిన స్వప్నం | మురిపాల ముద్దుల మూటై | ఆచార్య ఆత్రేయ| బాలు, సుశీల|



చిత్రం : మధుర స్వప్నం (1982)
సంగీతం : సత్యం
గీతరచయిత : ఆచార్య ఆత్రేయ
నేపధ్య గానం :  బాలు, సుశీల

Manasa Kavvinchake Lyrics in Telugu | మనసా కవ్వించకే నన్నిలా | ఆనాడు వెన్నెల నేనై కరిగాను | మోముపై ముంగురులేమో | ఎగిరింది కడలి కెరటం | పండంటి కాపురం | సుశీల | మైలవరపు గోపి



 చిత్రం:  పండంటి కాపురం (1972)
సంగీతం:  కోదండపాణి
గీతరచయిత:  మైలవరపు గోపి
నేపధ్య గానం:  సుశీల


నడకా హంసధ్వని రాగమా | హిమగిరికా సరిఝరి వాహినిలో | కన్యాకుమారి కౌగిలింతలలో | బంగారు కానుక | బాలు, జానకి గారి హిట్స్ సాంగ్స్


 


చిత్రం : బంగారు కానుక (1982)

సంగీతం :  సత్యం

గీతరచయిత : వేటూరి

నేపథ్య గానం : బాలు, జానకి 


పల్లవి :

అతడు 

నడకా హంసధ్వని రాగమా 

ఆది నడుమా గగనంలో కుసుమమా 

నడకా హంసధ్వని రాగమా 

ఆది నడుమా గగనంలో కుసుమమా 

మణిపురిలో వయ్యారమా 

పురివిప్పిన మయూరమా 


ఆమె 

నడకే హంసధ్వని రాగామే  

అది నడుమే గగనంలో కుసుమమే 

శ్రుతిలయానుబంధమే 

స్వరజతి కల్యాణమే 

నడకే హంసధ్వని రాగామే  

అది నడుమే గగనంలో కుసుమమే  


చరణం1

అతడు  

హిమగిరికా సరిఝరి వాహినిలో 

అలరేగిన సితవర్ణ తురంగమా 

(ఆ ఆ ఆ ఆ ఆఆ  ఆ ఆఆ ఆ) 

హిమకర కర మహిమాన్విత నిశీధిలో 

చెలరేగిన చేకోరిక విహంగామా 


పరువాల పతంగమా...  

హృదయాల మృదంగమా 

వసంత పంచమ సుస్వరమా 

వార్షుకాభ్రసడ్జమ నిస్వనమా 


ఆమె 

స గారి...  సరిసని.పా  నిసరి 

స స   ప ప   ప ప ప ప  గపగరిస  


అతడు  

నడకా హంసధ్వని రాగమా


ఆమె 

నడకే హంసధ్వని రాగామే  


చరణం 2 :

అతడు 

కాశ్మీర మందార  కుసుమంలో 

మధువులైన పెదవుల మకరందామా 


ఆమె 

ఆ ఆ  ఆఆ  ఆ ఆ   ఆ ఆ ఆ ఆ 


అతడు  

కన్యాకుమారి కౌగిలింతలలో 

కదలి పొంగు కడలీతరంగమా 

నా జీవన దాహమా  నా జవ్వన మొహమా 

అరుణచరణ యుగ చారణమా 

మధురగతుల మదవారణమా 


ఆమె 

సరి  సరి  ప గ ద ప  గప  నిప   నిసరి 

నిస గరి  సరి  స ని గ ప  గరిస  


అతడు  

నడకా హంసధ్వని రాగమా 

నడకే హంసధ్వని రాగామే 


చరణం 3 : 

నా మానస సరోవరస్థీరంలో 

కలికి నెలలు చిలికే కల్హారమా 


ఆమె  

ఆ ఆ ఆ   ఆ ఆ ఆ ఆ ఆ ఆ ఆఆ 


అతడు  

కలహంసలు కలలు కన్న స్వప్నంలో 

హింసపడిన హంసల నయగారమా 

నడకే ఒక నాట్యమా

నడకే ఒక నాట్యమా

నామృగేంద్రమధ్యమా

శరత్వేణురవరంజితమా .... 

శరదంబరచెంచల సంచితమా

 

ఆమె  

తకున్దరి తకఝను... తకున్దరి తకఝను

తధిగిన తొం తకిట తొం తక తొం త


అతడు  

నడకా హంసధ్వని రాగమా 

ఆది నడుమా గగనంలో కుసుమమా 

మణిపురిలో వయ్యారమా 

పురివిప్పిన మయూరమా

 

ఆమె 

నడకే హంసధ్వని రాగామే  

అది నడుమే గగనంలో కుసుమమే 

శ్రుతిలయానుబంధమే 

స్వరజతి కల్యాణమే  

నడకే హంసధ్వని రాగామే  

అది నడుమే గగనంలో కుసుమమే