పెండ్యాల లేబుల్‌తో ఉన్న పోస్ట్‌లను చూపుతోంది. అన్ని పోస్ట్‌లు చూపించు
పెండ్యాల లేబుల్‌తో ఉన్న పోస్ట్‌లను చూపుతోంది. అన్ని పోస్ట్‌లు చూపించు

neekai vechithinayya song lyrics in telugu | నీకై వేచితినయ్యా | Krikrishnarjunaa Yuddam Movie Songs Lyrics

చిత్రం :  శ్రీకృష్ణార్జునయుద్ధం (1963)
సంగీతం :  పెండ్యాల
గీతరచయిత :  పింగళి
నేపధ్య గానం :  సుశీల 

పల్లవి :
నీకై వేచితినయ్యా... 
ఓ.. ఏకాంత రామయ్యా... ఆ
నీకై కాచితినయ్యా...ఆ...ఆ

నీకై వేచితినయ్యా... 
ఓ ఏకాంత రామయ్యా... ఆ..
నీకై కాచితినయ్యా...ఆ...ఆ..
నీకై కాచితినయ్యా... 

చరణం 1 :
నీవీ క్షణమున వచ్చెదవోయని... 
ఎదురులు చూచితినయ్యా..ఆ..
ఎదురులు చూచితినయ్యా

నీవు నడతువని త్రోవ త్రోవల
పూవుల పరచితినయ్యా
నీకై వేచితినయ్యా... 
ఓ ఏకాంత రామయ్యా..
నీకై కాచితినయ్యా...

చరణం 2 :
చిగురాకులలో గాలి కదిలినా
నీవని భ్రమచితినయ్యా..ఆ...
నీవని భ్రమచితినయ్యా
చిలుక పలికినా.. నీ పిలుపేయని
ఉలుకున కలగితినయ్యా...ఆ...

నీకై వేచితినయ్యా... 
ఓ ఏకాంత రామయ్యా..
నీకై కాచితినయ్యా...

చరణం 3 : 
నీకు ప్రియముగా విరిసిన పూవుల 
మాలికలల్లితినయ్యా..ఆ..
మాలికలల్లితినయ్యా...
మనసున నిలిచిన మంగళ రూపము
ఎన్నడు చూచెదనయ్యా...ఆ..

నీకై వేచితినయ్యా... 
ఓ ఏకాంత రామయ్యా..ఆ
నీకై కాచితినయ్యా...ఆ...ఆ..
నీకై కాచితినయ్యా...