సంగీతం : బి. గోపాలం
గీతరచయిత : సినారె
నేపధ్య గానం : సుశీల, బాలు
సంగీతం : సత్యం
గీతరచయిత : వేటూరి
నేపథ్య గానం : బాలు, జానకి
పల్లవి :
అతడు
నడకా హంసధ్వని రాగమా
ఆది నడుమా గగనంలో కుసుమమా
నడకా హంసధ్వని రాగమా
ఆది నడుమా గగనంలో కుసుమమా
మణిపురిలో వయ్యారమా
పురివిప్పిన మయూరమా
ఆమె
నడకే హంసధ్వని రాగామే
అది నడుమే గగనంలో కుసుమమే
శ్రుతిలయానుబంధమే
స్వరజతి కల్యాణమే
నడకే హంసధ్వని రాగామే
అది నడుమే గగనంలో కుసుమమే
చరణం1
అతడు
హిమగిరికా సరిఝరి వాహినిలో
అలరేగిన సితవర్ణ తురంగమా
(ఆ ఆ ఆ ఆ ఆఆ ఆ ఆఆ ఆ)
హిమకర కర మహిమాన్విత నిశీధిలో
చెలరేగిన చేకోరిక విహంగామా
పరువాల పతంగమా...
హృదయాల మృదంగమా
వసంత పంచమ సుస్వరమా
వార్షుకాభ్రసడ్జమ నిస్వనమా
ఆమె
స గారి... సరిసని.పా నిసరి
స స ప ప ప ప ప ప గపగరిస
అతడు
నడకా హంసధ్వని రాగమా
ఆమె
నడకే హంసధ్వని రాగామే
చరణం 2 :
అతడు
కాశ్మీర మందార కుసుమంలో
మధువులైన పెదవుల మకరందామా
ఆమె
ఆ ఆ ఆఆ ఆ ఆ ఆ ఆ ఆ ఆ
అతడు
కన్యాకుమారి కౌగిలింతలలో
కదలి పొంగు కడలీతరంగమా
నా జీవన దాహమా నా జవ్వన మొహమా
అరుణచరణ యుగ చారణమా
మధురగతుల మదవారణమా
ఆమె
సరి సరి ప గ ద ప గప నిప నిసరి
నిస గరి సరి స ని గ ప గరిస
అతడు
నడకా హంసధ్వని రాగమా
నడకే హంసధ్వని రాగామే
చరణం 3 :
నా మానస సరోవరస్థీరంలో
కలికి నెలలు చిలికే కల్హారమా
ఆమె
ఆ ఆ ఆ ఆ ఆ ఆ ఆ ఆ ఆ ఆఆ
అతడు
కలహంసలు కలలు కన్న స్వప్నంలో
హింసపడిన హంసల నయగారమా
నడకే ఒక నాట్యమా
నడకే ఒక నాట్యమా
నామృగేంద్రమధ్యమా
శరత్వేణురవరంజితమా ....
శరదంబరచెంచల సంచితమా
ఆమె
తకున్దరి తకఝను... తకున్దరి తకఝను
తధిగిన తొం తకిట తొం తక తొం త
అతడు
నడకా హంసధ్వని రాగమా
ఆది నడుమా గగనంలో కుసుమమా
మణిపురిలో వయ్యారమా
పురివిప్పిన మయూరమా
ఆమె
నడకే హంసధ్వని రాగామే
అది నడుమే గగనంలో కుసుమమే
శ్రుతిలయానుబంధమే
స్వరజతి కల్యాణమే
నడకే హంసధ్వని రాగామే
అది నడుమే గగనంలో కుసుమమే
కొప్పులోని పువ్వమ్మ.. బాయి కాడి బొడ్డెమ్మ
కొప్పులోని పువ్వమ్మ.. బాయి కాడి బొడ్డెమ్మ
గంగ దాటిపోకమ్మో.. గంగితాలి కమలమ్మ
గంగ దాటిపోకమ్మో.. గంగితాలి కమలమ్మ
చేను గట్ల పువ్వమ్మ.. ఉసికెలోని గౌరమ్మ
చేను గట్ల పువ్వమ్మ.. ఉసికెలోని గౌరమ్మ
సిప్పి మరిసిపోకమ్మో.. దప్పు మంటు కాంతమ్మ
సిప్పి మరిసిపోకమ్మో.. దప్పు మంటు కాంతమ్మ
పెద్దమాస పొద్దుల్లో.. రాగి వన్నె ముగ్గుల్లో
అడుగే పెడితే మాతల్లో.. పసుపు పచ్చ వెన్నెల్లో
ముంగిట ముగ్గు సుక్కల్లో.. ఎగిలి పూల బతుకమ్మలో
కొప్పులోని పువ్వమ్మ.. బాయి కాడి బొడ్డెమ్మ
గంగ దాటిపోకమ్మో.. గంగితాలి కమలమ్మ
రెండో నాడు రేణమ్మ.. అటుకులొలిసే లక్ష్మమ్మ
రెండో నాడు రేణమ్మ.. అటుకులొలిసే లక్ష్మమ్మ
మూడో నాడు ముద్దెంత.. ముద్ద పప్పు దేశంత
నాలుగొద్దులల్ల సందెల్లో.. నానెసి బియ్యమియుల్లో
నాలుగొద్దులల్ల సందెల్లో.. నానెసి బియ్యమియుల్లో
ఐదో తనము కైలమ్మ.. అట్లు చేసి పెట్టమ్మ
ఐదో తనము కైలమ్మ.. అట్లు చేసి పెట్టమ్మ
అర్రెమ్ ఏలే నాగమ్మ.. అలిగి ఉంటె గౌరమ్మ
నైవేద్యాలు వద్దమ్మ.. నెలతి పూజ జాలమ్మ
ఏడు వేపకాయల్లో.. తోడు వచ్చు పుణ్యాలో
అన్నాదమ్ములిండ్లల్లో.. సున్నాలేసే కాంతుల్లో
కడపా కడగ వేపిల్లో.. కోరి దీవెనార్తుల్లో
కొప్పులోని పువ్వమ్మ.. బాయి కాడి బొడ్డెమ్మ
గంగ దాటిపోకమ్మో.. గంగితాలి కమలమ్మ
ఎండి గిన్నె యతకమ్మ.. వెన్న ముద్ద చిలకమ్మ
ఎండి గిన్నె యతకమ్మ.. వెన్న ముద్ద చిలకమ్మ
ఎనిమిదింట నువ్వుల్లో.. అలుగు జల్లు లోయమ్మ
పైడి గొలుసు ఊయల్లో.. పగడాలంటి పాపల్లో
పైడి గొలుసు ఊయల్లో.. పగడాలంటి పాపల్లో
నిండా తొమ్మి దొద్దుల్లో.. పండే నోచె నోముల్లో
నిండా తొమ్మి దొద్దుల్లో.. పండే నోచె నోముల్లో
గునుగు పూల వెనాలో.. ఉరిగి తంగేడు పూలో
సత్తు ముద్ద సారెల్లో.. తరలి పోయే అస్తిల్లో
వాయినాల పంచంగా.. ఏడాది ఎదురు చూడంగా
కొప్పులోని పువ్వమ్మ.. బాయి కాడి బొడ్డెమ్మ
కొప్పులోని పువ్వమ్మ.. బాయి కాడి బొడ్డెమ్మ
గంగ దాటిపోకమ్మో.. గంగితాలి కమలమ్మ
పోయి రావే బతుకమ్మ.. బతుకు తెరువు గంగమ్మ
పోయి రావే బతుకమ్మ.. బతుకు తెరువు గంగమ్మ
నిండా కొంగు సాపిండే.. తొల్కా పోను మాయమ్మ
నిండా కొంగు సాపిండే.. తొల్కా పోను మాయమ్మ
సంగీతం: కె.వి. మహదేవన్
గీతరచయిత: ఆచార్య ఆత్రేయ
నేపధ్య గానం: బాలు, సుశీల