Uyyala Jampala Song Lyrics | Uyyalaina Jampalaina Title Song | Raj Tarun | ఉయ్యాలైనా జంపాలైనా

 


చిత్రం : ఉయ్యాలా జంపాలా (2013)
సంగీతం : సన్నీ M.R
రచన : వాసు వలబోజు
గానం : హర్షిక గుడి, అనుదీప్ దేవ్



ఆమె 

ఉయ్యాలైనా జంపాలైనా 

నీతో ఊగమనీ

మళ్లీ మనలా పుట్టించాడు సీతారాములనీ

ఇదోరకం స్వయం వరం 

అనేట్టుగా ఇలా

నీ చూపులే నాపై పడే 

ఓ పూల మాలలా

హరివిల్లు దారాల బంగారు ఉయ్యాల

వెన్నెల్లొ ఊగాలిలా


అతడు 

ఒహో... నీవేగ నాలో 

నా గుండెలో శ్రుతీ లయ

ఒహో... నీవేగ నాకు 

నా ఊహలో సఖీ ప్రియా


కోరస్ 

తక్ ధినధీమ్.. తక్ ధినధీమ్..

తక్ ధినధీమ్.. తక్ ధినధీమ్.. తక్..

టడడం..టడం.టడం..టం..

టడడం..టడం.టడం..టం..

టడడం..టడం.టడం.టడం.టడం.టడం

టడడం..టడం.టడం..టం..

టడడం..టడం.టడం..టం..

టడడం..టడం.టడం.టడం.టడం.టడం...

తక్ ధినధీమ్.. తక్ ధినధీమ్.. తక్..


ఆమె 

చెయ్యే చాస్తే అందేటంతా దగ్గర్లో ఉంది

చందమామ నీలామారి నా పక్కనుంది

నీకోసం నాకోసం ఇవ్వాళే ఇలా

గుమ్మంలో కొచ్చింది ఉగాదే కదా


అతడు 

ఒక్కోక్షణం పోతేపోనీ పోయేదేముంది

కాలాన్నిలా ఆపే బలం ఇద్దర్లో ఉంది

రేపంటూ మాపంటూ లేనే లేని

లోకంలో ఇద్దరినే ఊహించని


ఆమె 

ఎటువైపు చూస్తున్న

నీరూపు కనిపించి 

చిరునవ్వు నవ్వే ఎలా

ఎదురైతే రాలేను ఎటువైపు పోలేను 

నీ పక్కకొచ్చేదెలా


అతడు 

ఒహో... నా జానకల్లే 

ఉండాలిగా నువ్వే ఇలా

ఒహో... వనవాసమైన 

నీ జంటలో సుఖం కదా


ఆమె 

ఉయ్యాలైనా జంపాలైనా 

నీతో ఊగమనీ


అతడు  

మళ్లీ మనలా పుట్టించాడు 

సీతా రాములనీ


ఆమె 

నా పాదమే పదే పదే 

నీ వైపుకే పడే


అతడు 

జోలాలి పాట ఈడునే పడింది ఈ ముడే


ఆమె 

ఒహో... ఎన్నాళ్లగానో 

నా కళ్లలో కనే కల

ఒహో... ఈ ఇంద్రజాలం 

నీదేనయా మహాశయా


అతడు 

గుండెకే చిల్లే పడేలా 

జింకలా నువ్వే గెంతాలా

ఇద్దరం చెరో సగం సగం సగం సగం


ఎందుకో ఏమో ఈవేళా 

నేనే సొంతం అయ్యేలా

నువ్వు నా చెంతేచేరి చేయి నిజం కొంచెం 


Disclaimer: This lyrics content is for educational and entertainment purposes only. All rights belong to the respective owners.

కామెంట్‌ను పోస్ట్ చేయండి

0 కామెంట్‌లు