Vangamaaku Song Telugu Lyrics In Telugu || Driver Ramudu Movie || NTR,Jayasudha || Shalimarcinema | డ్రైవరు రాముడు

వంగమాకు..వంగమాకు

చిత్రం: డ్రైవరు రాముడు

సంగీతం: చక్రవర్తి

గీత రచన: వేటూరి

గానం: బాలు, సుశీల


పల్లవి: 


అతడు 

దొంగా.... (అమ్మో....)

అరెరెరె.. వంగమాకు..వంగమాకు

వంగి వంగి దొంగలాగ పాకమాకు

వంగమాకు వంగమాకు

వంగి వంగి దొంగలాగ పాకమాకు

వంగుతుంటే కొంగులోని

గుట్టంత రట్టమ్మో చుక్కమ్మా.. 

వంగమాకు..


ఆమె 

లాగమాకు లాగమాకు

లాగిలాగి పైటకొంగు జారనీకు

లాగమాకు..ఆహ..లాగమాకు

లాగిలాగి పైటకొంగు జారనీకు

లాగుతుంటే.. కొంగు చాటు

గుట్టంత రట్టయ్యో రామయ్యో

లాగమాకు



చరణం 1: 

అతడు

ఈతముల్లు.. (అబ్బా...)

గుచ్చుకుంటే.. (అమ్మో..)

ముంజలాంటి లేత వళ్ళు గాయం

ఈతముల్లు.. గుచ్చుకుంటే..

ముంజలాంటి లేత వళ్ళు గాయం

తోటమాలి చూశాడా...ఆ

బడితపూజ కాయం..


ఆమె 

మాలి నాకు మామేలే..

తోట కూడ మాదేలే..


అతడు 

డండఢ డాఢ డండడ..డడ


ఆమె 

మాలి నాకు మామేలే 

తోట కూడ మాదేలే..

ముల్లయినా నన్ను తాకి 

పువ్వయి/పోతుందిలే

రామయ్యో..ఓ.. వెళ్ళి రావయ్యో..

ఆహా రామయ్యో..ఓ.. వెళ్ళి రావయ్యో


అతడు 

అరెరెరె వంగమాకు (ఆహా..)

వంగమాకు.. (ఆహా..)

వంగి వంగి దొంగలాగ పాకమాకు


ఆమె 

అమ్మమ్మ లాగమాకు (ఆహ..)

లాగమాకు (ఆహహ..)

లాగిలాగి పైటకొంగు జారనీకు


చరణం 2: 

ఆమె 

చేను మీద చొరవచేస్తే..

చెంపమీద చేతి ముద్ర ఖాయం

చేను మీద (అహ్హా..)

చొరవచేస్తే..(ఓహ్హో..)

చెంపమీద చేతి ముద్ర ఖాయం

నేను గొడవ చేశానా..ఆ..

ఎవరు నీకు సాయం


అతడు 

ఆడ చెయ్యి తగిలితే 

హాయి నాకు కలిగితే


ఆమె 

డడ్డర డడ్డడడ్డా..డడ్డర డడ్డడడ్డా..


అతడు 

ఆడ చెయ్యి తగిలితే

హాయి నాకు రగిలితే..

వంగ తోటలో సరసం 

వరసే అవుతుందిలే..

చుక్కమ్మో.. నాకు చిక్కమ్మో..


ఆమె 

వ్వె..వ్వే..వ్వే..వ్వే..


అతడు 

ఆ చుక్కమ్మో.. నాకు చిక్కమ్మో..


ఆమె 

వ్వె..వ్వే..వ్వే..వ్వే..


అతడు 

వంగమాకు (ఆహా..)

వంగమాకు.. (ఆహా..)

వంగి వంగి దొంగలాగ పాకమాకు

వంగుతుంటే.. కొంగులోని..

గుట్టంత రట్టమ్మో చుక్కమ్మా.. 

వంగమాకు..

కామెంట్‌లు లేవు:

కామెంట్‌ను పోస్ట్ చేయండి