మనసు కన్ను చేసుకుని చూడర లోకం
ఎదను పెంచి పంచుకో ఎంచకు లోపం
మనసు కన్ను చేసుకుని చూడర లోకం
ఎదను పెంచి పంచుకో ఎంచకు లోపం
మనసు కన్ను చేసుకుని చూడర లోకం
మనసనేది దీపం అది మనిషికి రూపం
నీడే తోడు లేకుండ లేదుర దీపం
మనసు కన్ను చేసుకుని చూడర లోకం
చరణం 1:
అదిగో అతడే దక్షుడు
శివద్వేష దీక్షా దక్షుడు
ఏమి చూసి వలచావు శివుణ్ణి
ఎందుకు వరించావు వల్లకాటి విభుణ్ణి
గంగవెర్రి గంతులవాడు
చందమామ చితులవాడు
ఎగుడు దిగుడు కన్నులతోనే
రగిలిపోవు రసికుడు వాడు
ఏమి చూసి వలచావు శివుణ్ణి
ఎందుకు వరించావు వల్లకాటి విభుణ్ణి
చరణం 2:
గరళం కంఠాన దాచి ధరనే బ్రోచినవాడు
సరసం దేవతలకిచ్చి సన్యాసిగా మారినాడు
త్యాగం అతని రూపం..
అనురాగం అతని యోగం
అణువు కాదు కనులు కాదు
మనసు కన్నుగా మలచి
మహాశివుని వరించా
మనువాడి తరిస్తా
చరణం 3:
గౌరమ్మ హృదయ కళ్యాణ వీణ
మీటింది శివుని రూపం
మనసున్న చోట గునమల్లె తోచు
గునం ఉన్నవాడి లోకం
శీరస్తు ప్రేమానికి శ్రీ గౌరీ పెళ్ళికి
ఆది దంపతుల ప్రేమయేపలికి నాదే ఈ సృష్టికి
గౌరీ శివుడు ఆది మానవుడు కనురా దృస్తికి
చరణం 4:
పరవళ్ళతో వచ్చే పరుగెత్తి గంగ
నింగి నేలలు ఏకధారగా పొంగ
శివుడు చూసిన గంగ శివమెత్తి పోయే
భవుడు చూసిన గంగ పడగెత్తి దూకే
తన జటాజూటాలు విసిరినప్పుడు శివుడు
పట్టుబడిపోయింది పడతి గంగమ్మ
పగబట్టి చూసింది రగిలే గౌరమ్మ
సవతులిద్దరి మధ్య సరసుడా శివుడు
సగభాగమిచ్చాడు సతికి తన తనువు
సాంబశివుడైపోయే ఆ సదాశివుడు
అర్ధనారీశ్వరుడు ఆయే ఆ దేవుడు
ఓం... ఓం...
ఓం నామ శివాయ ఓం నామ శివాయ
ఓం నామ శివాయ ఓం నామ శివాయ
ఓం నామ శివాయ ఓం నామ శివాయ
ఓం నామ శివాయ ఓం నామ శివాయ
ఓం నామ శివాయ ఓం నామ శివాయ

కామెంట్‌లు లేవు:
కామెంట్‌ను పోస్ట్ చేయండి