Dasarathi Song Telugu in Lyrics || దాశరధీ కరుణాపయోనిధి || Sri Ramadasu || Nagarjuna, Sneha



అతడు
దాశరధీ కరుణాపయోనిధి
నువ్వే దిక్కని నమ్మడమా
నీ ఆలయమును నిర్మించడమా
నిరతము నిను భజియించడమా
రామకోటి రచియించడమా
సీతారామస్వామి నే చేసిన నేరమదేమి
నీ దయ చూపవదేమి,
నీ దర్శనమీయవదేమి
దాశరధి కరుణాపయోనిధి
గుహుడు నీకు చుట్టమా
గుండెలకు హత్తుకున్నావు
శబరి నీకు తోబుట్టువా
ఎంగిలి పళ్ళను తిన్నావు
నీ రాజ్యము రాసిమ్మంటినా
నీ దర్శనమే ఇమ్మంటిని కాని
ఏల రావు నన్నేల రావు
నన్నేల ఏల రావు
సీతా రామస్వామి
సీతా రామస్వామి నే చేసిన నేరమదేమి
నీ దయ చూపవదేమి,
నీ దర్శనమీయవిదేమి
ఆమె
రామ రసరమ్య ధామ రమణీయ
నామ రఘువంశ సోమ రణరంగ
భీమ రాక్షస విరామ కమనీయ కామ
సౌందర్య సీమ నీరదశ్యామ
నిజభుజోద్దామ భూజనల లామ
భువన జయ రామ
పాహి బద్రాద్రి రామ పాహి
అతడు
తక్షణ రక్షణ విశ్వ విలక్షణ
ధర్మ విచక్షణ గోదారి కలిసెనేమిరా
డాండడ డాండ డాండ నినదమ్ముల
జండము నిండ భస్మ వేదండము
నెక్కి నే పొగడు నీ అభయవ్రతమేదిరా
ప్రేమ రసాంతరంగ హృదయంగమ
శుంగ శుభంగ రంగ బహురంగ
దబంగ తుంగ సుగుణైక తరంగ
సుసంగ సత్య సారంగ సుశ్రుతి
విహంగ పాపపు ధుశంగా విభంగా
భూతల పతంగ మధు మంగళ
రూపము చూపవేమిరా
గరుడ గమన రారా
గరుడ గమన రారా

కామెంట్‌ను పోస్ట్ చేయండి

0 కామెంట్‌లు