Aa Ningiloni Chandamama Lyrics in Telugu | ఆ నింగిలోని చందమామ | | Eesha Movie Lyrics | Thrigun, Hebah Patel | R R Dhruvan | Shreya Ghoshal

ఆ నింగిలోని చందమామ..

చిత్రం: Eesha 
గానం: Shreya Ghoshal
సంగీతం: R R Dhruvan 
సాహిత్యం: R R Dhruvan 
నటీనటులు: Thrigun, Hebah Patel


ఆ నింగిలోని చందమామ.. 
నీ చేతులోన వాలిపోదా!
స్నేహమన్న మాట ఉంటే బ్రతుకులో..
ఏ దూరమైనా చేరువేగా.. 
ఏ కష్టమైనా ఇష్టమేగా!
స్నేహమన్న మంత్రముంటే మనసులో..
వేసవల్లి మండుతున్న గుండెలో..
వెన్నెల్లల్లే వచ్చి చేరుకుంటది!
చేదు చేదు అనుభవాల వరుసలో.. 
పంచదార పంచుతున్నది!
పల్లవి:
ఫ్రెండ్ షిప్.. 
చిన్ని నవ్వులెన్నో అల్లుతోంది!
ఫ్రెండ్ షిప్.. 
కొత్త రంగులెన్నో చల్లుతోంది!
ఫ్రెండ్ షిప్.. 
కలలకే రూపమొచ్చినట్టు నీ ముందే నిలిచింది!
ఫ్రెండ్ షిప్.. 
అమ్మలాగా లాలి పాడుతోంది!
ఫ్రెండ్ షిప్.. 
నాన్నలాగా దారి చూపుతోంది!
ఎప్పుడైనా..
 ఎక్కడైనా.. నీ తోడవుతానంది!
మరువలేని గుర్తులెన్నో.. 
నిలువలేని పరుగులెన్నో!
ఆకతాయి ఊసులెన్నో.. 
చిలిపి రూపురేఖలుగా!
అందమైన కవితలెన్నో.. 
సొంతమైన భవితలెన్నో!
చెరిపిలేని చరిత్రలెన్నో.. 
దోస్తులన్న ఆస్తులేగా!
కన్నీటిలోన కాంతి ఇంత స్నేహం..
అన్నింటిలోన గొప్పదేగా స్నేహం..
ఇంతకన్నా ప్రేమ జీవితాన.. 
కన్నా ప్రేమలాగ నిన్ను చేరలేని మాట సత్యం!
పల్లవి:
ఫ్రెండ్ షిప్.. 
చిన్ని నవ్వులెన్నో అల్లుతోంది!
ఫ్రెండ్ షిప్.. 
కొత్త రంగులెన్నో చల్లుతోంది!
ఫ్రెండ్ షిప్.. 
కలలకే రూపమొచ్చినట్టు నీ ముందే నిలిచింది!
ఫ్రెండ్ షిప్.. 
అమ్మలాగా లాలి పాడుతోంది!
ఫ్రెండ్ షిప్.. 
నాన్నలాగా దారి చూపుతోంది!
ఎప్పుడైనా.. 
ఎక్కడైనా.. నీ తోడవుతానంది!




కామెంట్‌లు లేవు:

కామెంట్‌ను పోస్ట్ చేయండి