📝 ఉండలేనంది నా కన్ను (Telugu Lyrics)
Movie: Vishwaroopam (Telugu)
Singers: Shankar Mahadevan, Kamal Haasan
Music Composers: Shankar-Ehsaan-Loy
Lyricist: Ramajogayya Sastry
Singers: Shankar Mahadevan, Kamal Haasan
Music Composers: Shankar-Ehsaan-Loy
Lyricist: Ramajogayya Sastry
(జతులు/Swara Syllables)
తగ తగ తగ దిన దిన దిన
నగ నగ నగ తకిట దాన దాన దాన
ధికిట ధికిట ధిగిన దాన ధాగృ దాన...
అభినవ నీత అభినయ రాజా
గోకుల బాలా కోటి ప్రకాశా
విరహ నరక శ్రీ రక్షక మాలా
కమ్మని కలను కదిపితే చాల
కన్నీటి కౌగిలి చేరవలేవా
ఊహల మాటున ఉండకురా
కళావెన్నెల తిందువు రామ్మేళ
పూతన గర్వమణంచిన వాడా
పాపపు విరహము బలిగొన రారా
మనసుంటే మాయావీరా...
మనసుంటే మాయావీరా...
మనసుంటే మాయావీరా...
ఉండలేనంది నా కన్ను నిను కానక
వెన్న దొంగ మరి వేధించకు
ఉండలేనంది నా కన్ను నిను కానక
వెన్న దొంగ మరి వేధించకు
శ్యామ సుందర కృష్ణా కృష్ణా
ప్రేమ మందిర కృష్ణా కృష్ణా
శ్యామ సుందర కృష్ణా కృష్ణా...
కృష్ణా !
ఉండలేనంది నా కన్ను నిను కానక
వెన్న దొంగ మరి వేధించకు
నింగి మేనైన నీలాల కల నీవు
అందిరావు అలా నన్ను విడిపోవు
కాస్తైనా మొరాలకించవే...
గుండె సడినాపి...
గుండె సడినాపి...
గుండె సడినాపి...
గుండె సడినాపి...
(గమదనిస నిదమమ గమ రిగరిస)
గుండె సడినాపి నీ దారి కాచానిలా
వెన్న దొంగ మరి వేధించకు
నళిన మోహన శ్యామల రంగా
నటన భావ శ్రుతి లయ గంగా
నిదురను నీకై త్యజించి
వన వ్రతము నిన్ను కొలుచు
రాధే నీ చెలియని
నీ రాధే నేనని రా రా రా
ఎవ్వేళ నువ్విలా రివ్విందివో అని
రవ్వంత ముస్తాబు పెంచుకున్నా
ఒళ్ళంతా కళ్ళుగా వేచా ఒకో యుగం
వెల్లువల్లే రారా క్షణం ఆగనిదే
నిన్ను చూపించదే జగం
వాడిపోదా ప్రియ సుమం
హో దొంగచాటు కౌగిలింతకి
పరిమళాల శ్వాసనివ్వు
తేనెలూరు పెదవుంచుల్లోన
కేరింతగా ఫలించు
ఇక భూలోకమే ఉన్న స్పృహ లేదని
తన్మయినేనై తరించాలిరా
వదిలిపోని వలపై పై
ఎదగా హత్తుకోలేవా
చెలిని... చెలిని...
కన్న తుడిచేసిన నిదుర
విడిచి వెళ్లకంటున్నా
కలని... కలని...
ఇక ఏ జన్మలో...నా
నువ్వు కనిపించులో..నా
చెలి ప్రాణాలు పోతే ఎలా...
అని కోరగా నీ ఆరాటమేల ప్రియా
నువ్వే ఊపిరిగా జీవించనా
తక తక తక దిమ్...
తక తక తక దిమ్...
-----END-----

0 కామెంట్‌లు