Oh Srivennelo Song Lyrics in Telugu | Kondapalli Rathaiah Movie songs Lyrics in Telugu | Harish, Surabhi



చిత్రం: కొండపల్లి రత్తయ్య (కొండపల్లి రత్తయ్య)
పాటదారులు: ఎస్.పి. బాలసుబ్రహ్మణ్యంకే.ఎస్. చిత్ర
సంగీతదర్శకుడు: ఎం.ఎం.శ్రీలేకా
పాటల రచయిత: డాక్టర్ సి. నారాయణ రెడ్డి


ఓ... సిరి వెన్నెల్లో విరిసింది ఓ మల్లిక
సిరి వెన్నెల్లో విరిసింది ఓ మల్లిక

వీచే చిరుగాలిలో వేచే వనకన్యలా

సాగే సెలయేటిలో ఊగే నెలవంకలా

ఎద మధుమాసమై 

తొలి ప్రేమను తెలిపిన చిరునవ్వులా...

ఓ... సిరి వెన్నెల్లో విరిసింది ఓ మల్లిక


ముంగురులా అవి ముచ్చటలాడే 

ఆశల తుమ్మెదలా

కనుబొమలా అవి నాట్యము నేర్చిన 

మన్మధ చాపములా

కన్నులు వెన్నెల దీపములా, 

రెప్పలు కలలకు వాకిళులా

తన శ్వాస సరిగమల వీ..ణ, 

వేకువ పూచిన వెలుతురులా ఆ...

ఓ... సిరి వెన్నెల్లో విరిసింది ఓ మల్లిక


అధరములా అవి మధువులు ఊరే 

పరువపు పగడములా

చిరునగవా అది తళతళ మెరిసిన 

మెరుపుల తోరణమా

భాషకు లొంగని భావమిదా 

ఏ కవి గాంచని స్వప్నమిదా

ఈ బాల మందార మా..ల 

తొలకరి చినుకుల సరిగమలా

ఓ... సిరి వెన్నెల్లో విరిసింది ఓ మల్లిక

సిరి వెన్నెల్లో విరిసింది ఓ మల్లిక

కామెంట్‌ను పోస్ట్ చేయండి

0 కామెంట్‌లు