రై రై రా రా (సాహిత్యం)
Cast: Mega PowerStar Ram Charan, Janhvi Kapoor,
Sharma
Music: A R Rahman
Lyrics: Anantha Sriram
Singer: A R Rahman
Music Supervisor: Prashanth Venkat
పల్లవి:
రై రై రారా రై రై రారా
అడ్డేలేని దారై రారా
రై రై రారా రై రై రారా
అడ్డేలేని తీరై రారా
దూకేటి జోరై రా
పోరాడేటి పోరై రా
నీలో ఆరు నూరై రా
మందాల్లోంచి వెరై రా
భయం పీకి పారేయరా
సిగ్గుంటే సీరైరా
జై కొట్టేటి పేరై రారా
నీ రాక చూసి లోకం చేసే
హోరాయ్ హోరాయ్ హోరాయ్ రారా
రై రై రారా రై రై రారా
అడ్డేలేని దారై రారా
రై రై రారా రై రై రారా
అడ్డేలేని తీరై రారా
బెరుగ్గా ఆ బెరుగ్గా
ఇరుగ్గా ఆ ఇరుగ్గా
పాతేసు కో కోయిల
నువ్వు నిన్నే నీ లోపల
హే పాతికెళ్లాకే
నువ్వు పాతబడిపోకురా
చరణం 1:
నిన్నటి లాగే రేపున్నదంటే
ఈరోజేమ్ పీకవనీ
నీ అయ్య వడ్డీ నీ బిడ్డ కడితే
నువ్వేమి పొడిచావనీ?
మొండెంలో తల దించేటట్టయితే
మొలతాడు ఎందుకు కట్టావ్ తెంచేసే
నువ్వు మొత్తం రక్తం మార్చుకొని వచ్చేసే హే..
రై రై రారా రై రై రారా
అడ్డేలేని దారై రారా
చరణం 2:
ఆటను కో కోయ్ ఆటంటే బతుకోయ్
నీ ఆట బతకాలిరోయ్
మాటనుకో కోయ్ గెలుపంటే వెలుగోయ్
గెలుపై నువ్వు వెలగాలిరోయ్
మండే గుండె నీలో లేదంటే
కాలు చేయి ఉన్నా లేనట్టే
నీకు నెగ్గే నైజం అర్థం కానట్టే హే
రై రై రారా రై రై రారా
అడ్డేలేని దారై రారా
రై రై రారా రై రై రారా
హద్దెలేని తీరై రారా
బెరుగ్గా ఆ బెరుగ్గా
ఇరుగ్గా ఆ ఇరుగ్గా
పాతేసు కో కోయిల
నువ్వు నిన్నే నీ లోపల
హే పాతికెళ్లాకే
నువ్వు పాతబడిపోకురా

0 కామెంట్‌లు