Song Name :Maagha Maasavela
Music Director :Koti
Lyrics :Sirivennela Sitarama Sastry
Singers:Udit Narayan, Shreya Ghoshal
Movie Name :Ela Cheppanu
ఆమె
కళలు చిలుకు అలివేణి నుదుట
కస్తూరి తిలకమును దిద్దరే
సిగ్గులొలుకు చెలి పసిడి బుగ్గలకు
పసుపుతో నిగ్గు పెంచరే
కొత్త వెలుగు చూపించగలుగు
పారాణి పూసి నడిపించరే
కన్నె గోదారి వధువుగా
మారి కడలి కౌగిలికి చేరు తరుణమిది
వేడుకైన కళ్యాణ సమయమిది
అతడు
మాఘమాస వేళ
కోకిలమ్మ పాట
ప్రేమ పర్ణశాల
చూపుతున్న బాట
అనురాగం తోడు రాగా
నవలోకం ఏలుకోగా
శుభలగ్నం చేరుకుందని పిలిచేలా
ఓఓ ఓఓ ఓఓఓ ఓఓ ఓఓ ఓ
ఓఓ ఓఓ ఓఓ ఓ ఓఓఓ ఓఓ ఓఓ ఓ
ఆమె
మాఘమాస వేళ
కోకిలమ్మ పాట
అతడు
ఎవరిని నే చూసినా
అడుగులు ఎటు వేసినా
ఎదురయేది నువ్వే
నీకు తెలుసునా
ఆమె
నిను కలవని రోజున
గడవదు ఏం చేసినా
వదలనంది నన్నే తీపి యాతన
అతడు
నువ్వు వెతికే మజిలీ
అవనా ఆఆఆ
ఆమె
నెచ్చెలిగా మదిలో చేరనా ఆఆ
అతడు
ఇక అటు ఇటు ఎగరకే పావురమా
నా కౌగిలి కొలువున స్థిరపడుమా
ఆమె
తలపును దోచిన దొరతనమా
నా అనుమతి తమకిక అవసరమా
అతడు
నన్ను నీలో నిన్ను నాలో
నింపే నీ ప్రేమ
ఆమె
మాఘమాస వేళ
కోకిలమ్మ పాట
ఆమె
మనసుకి మలి జన్మగా
నువ్వు మలిచిన బొమ్మగా
నిన్ను అల్లుకోనీ కొత్త ఊపిరి
అతడు
గగనము దిగి నేరుగా
ప్రియసఖిలా చేరగా
నన్ను కలుసుకుందా
నింగి జాబిలి
ఆమె
నా మనవిని విననే వినవా
అతడు
ఇది నిజమని అననే ఆనవా
ఆమె
నది నడకలు నేర్పిన సాగరమా
నీ ఒడిలో ఒదిగితే చాలు సుమా
అతడు
తెలియని సైగల స్వాగతమా
ఈ బిడియము దేనికే సోయగమా
ఆమె
ఆగనీదు సాగనీదు
చూడు ఈ ప్రేమ
అతడు
మాఘమాస వేళ
కోకిలమ్మ పాట
ఆమె
అనురాగం తోడు రాగా
నవలోకం ఏలుకోగా
శుభలగ్నం చేరుకుందని పిలిచేలా
ఓఓ ఓఓ ఓఓఓ ఓఓ ఓఓ ఓ
ఓఓ ఓఓ ఓఓఓ ఓఓఓ ఓఓ ఓఓ ఓ

0 కామెంట్‌లు