Thalli Pegu Song Lyrics in Telugu | Venkatesh Daggubati | Priyamani | Mani Sharma | Narappa Movie songs Lyrics in Telugu

తల్లి పేగు చూడు ఎలా - narappa



Song: Thalli Pegu Movie: Narappa Cast: Daggubati Venkatesh, Priyamani Music: Mani Sharma Singer - Saindhavi Lyrics - Sirivennela Seetharama Sastry






తల్లి పేగు చూడు ఎలా
తల్లడిల్లిపోయేనయ్యా
కళ్ళు మూసి ఏటో వెళ్లిపోకయ్యా ఆ.. 
నన్ను కన్నా తండ్రి
ఇలా రావయ్యా
కడుపులోనే ఉండక ఈ 
పుడమికెలా వస్తివయ్యా
సంకనెత్తుకున్నంత సేపు లేవయ్యా ఆ..
ఇంతలోనే ఏమయ్యావో చెప్పయ్యా 
రాకాసి చీకటిలో
ఏ కీడు తాకిందో 
ఏకాకివైపోయావా చంద్రయ్యా
కళ్లెరాజేసి రేయిని చుడయ్యా
తెల్లారి సూరిడల్లే రావయ్యా
నీ సెమట తడి ఇంకా
ఇంకనే లేదయ్యా
ఈ తోటనంతా తడిమి సుడయ్యా ఆ..
నీ నవ్వు సడి లేక  
గూడు సిన్నబోయెనయ్యా
ఇంతలోనే ఋణము తీరే నీకయ్యా
మట్టిని చిల్చుకొచ్చే విత్తనమై రావయ్యా
సావుని కూడా సంపే 
సత్తువ నీదయ్యా ఆ..
అష్టదిక్కులన్నీ సుట్టు ముడుతున్నా ఆ..
ఇట్టేనేట్టి సప్పునా ఇంటికి రావయ్యా
తల్లి పేగు చూడు ఎలా
తల్లడిల్లి పోయేనయ్యా
కళ్ళు మూసి ఏటో వెళ్లి పోకయ్యా ఆ..
నన్ను కన్నా తండ్రి
ఇలా రావయ్యా
కన్నుదీలీ చూపెల్లి మసకేసి పోయేలే
గుండెల్లో మంట నిన్ను చూపేనా
నన్నొదిలి నువ్వెళ్ళి కుడి కట్టి ప్రాణాలే
నా ఆశకాయువు ఇంకా మిగేలేనా ఆ..
కటిక నిజం నీదని
ఏ రుజువె దొరవని
నమ్మాలంటే కష్టం కదా నాయనా
ఆకైనా అల్లాడదే చుడయ్యా
నువు రాకుంటే గాలాడదే కన్నయ్యా
తల్లి పేగు చూడు ఎలా
తల్లడిల్లి పోయేనయ్యా
కళ్ళు మూసి ఏటో వెళ్లి పోకయ్యా
నన్ను కన్నా తండ్రి
ఇలా రావయ్యా
కడుపులోనే ఉండక ఈ 
పుడమికెలా వస్తివయ్యా
సంక నెత్తుకున్నంత సేపు లేవయ్యా
ఇంతలోనే ఏమయ్యావో సెప్పయ్యా
రాకాసి చీకటిలో
ఏ కీడు తాకిందో 
ఏకాకివై పోయావా చంద్రయ్యా
కళ్లెరాజేసి రేయిని చుడయ్యా
తెల్లారి సూరిడల్లే రావయ్యా

కామెంట్‌లు లేవు:

కామెంట్‌ను పోస్ట్ చేయండి