Nitho Edadugulu Song Lyrics in Telugu | Folk Song Lyircs in Telugu


నీతో ఏడడుగులు (Nitho Edadugulu)




పాట వివరాలు:

 

గానం: రాము
సంగీతం: మదీన్ ఎస్.కె.
సమర్పణ: బుల్లెట్ బండి లక్ష్మణ్







ఓ ఓ ఓఓ ఓ 
ఓ ఓ ఓఓ ఓ
నాపై మనసు పడి నీకేం లాభం
నీపై మనసు పడితే ఓర్వదు ఈ లోకం
నాపై ప్రేమ పెంచుకోకే దీపం
చిమ్మచీకటై పోతది లోకం
నువ్వే ఆకాశమంత నేనే నీ చెంత ఎంత
నువ్వే ఆ మేడలోన నేనే నీ నీడలోన
నీతో ఏడడుగులు వేయలేనులే
నీతో జీవితమే పంచుకోనులే
మెడలో మూడు ముళ్ళు వేయలేనులే
నీతో వందేళ్లే ఉండలేనులే
చందనాలు నిప్పుకున్న  చక్కనైన చందమామ
చమ్మగిల్లకమ్మ  నల్ల నేయను గనకా 
యశోదమ్మ సీరోభారమైన వాడి అల్లరోడు
మనుగుతున్నాడమ్మా  నీ ప్రేమకి వెనుక 
ఏడులో నందలనా చూపు ఈ ప్రేమకి లీల 
ఎవలే వెన్నెలలా ఏంటి నీ అల్లరి గొలా 
ఏం బతుకులే నావి .. నా బాధలే నావి
నీతో నేను సరి తూగలేనులే
నా బదులుగా నీవు నీ బంధమైనోడ్ని 
మనసే పడితే బాధ గుండెదే
ఎవరమ్మ నువ్వు ఓ దొరసాని
మనసే పడుతున్నవే  ఈ పేదోని
ఒకటయ్యే దూరమయ్యే బదులుగా ఎట్లా
నాకు నేనే నీకు దూరంగా ఉంటా
నీతో ఏడడుగులు వేయలేనులే
నీతో జీవితమే పంచుకోనులే
మెళ్ళో  మూడు ముళ్ళు వేయలేనులే
నీతో వందేళ్లే ఉండలేనులే
బంగారు బొమ్మలాగా  పెరిగినవమ్మ నువ్వు
నా ఇంట బాధలు నీకంట వద్దులే
బంగారు బిందెతోని  నా కాళ్లు కడగలేరు
నీ కాలికి మెట్టె నెట్టే అవుదునే
అందని ఆశ పడి ఏమిటి లాభం
చివరికి మిగిలేనే ఇరువురి శోకం
ఒకటయ్యే దూరమయ్యే బదులుగా ఎట్లా
నాకు నేనే నీకు దూరంగా ఉంటా
నీతో ఏడడుగులు వేయలేనులే
నీతో జీవితమే పంచుకోనులే
మెడలో మూడు ముళ్ళు వేయలేనులే
నీతో వందేళ్లే ఉండలేనులే


కామెంట్‌లు లేవు:

కామెంట్‌ను పోస్ట్ చేయండి