Song Name: Payaname
Music Composed by: Anup Rubens
Singers: Anup Rubens, Satya Prakash
Lyrics by: Kasarla Shyam
పల్లవి:
ఎన్నో ఎన్నెన్నో మలుపులు
ఎన్నో ఎన్నెన్నో మార్పులు
ఎన్నో ఎన్నెన్నో పిలుపులు
ఎన్నో ఎన్నెన్నో తలపులు
నవ్వులు ఓ చోట రాలే పువ్వులు ఓ చోట
జారే మనసే ఓ చోట గుండె తడిసేను ఓ చోట
ఎప్పుడూ వస్తామో మళ్ళీ ఎన్నడు చూస్తామో
రెప్పల మాటున దోస్తామో గుర్తులుగా మోస్తామో
హే యా పయనమే సాగే ఈ పయనమే
చేరే ఏ గమ్యమే పయనమే పయనమే
హే యా పయనమే బాగుందీ ఈ పయనమే
తాకే ఏ తీరమే పయనమే పయనమే
చరణం 1
ఏ నిమిషంలో ఏమవుతుందో
ఏ మజిలీ ఎంతసేపు నేస్తమవుతుందో
ఎవరెవరో చేరి పరిచయమే మారి
దూరాలే కలిపేటి దారాలై
దగ్గరకే వచ్చి ఎగిరే రెక్కలనే ఇచ్చి
కొత్త లోకం చూపించి జ్ఞాపకమైతారు నచ్చి
హే యా పయనమే సాగే ఈ పయనమే
చేరే ఏ గమ్యమే పయనమే పయనమే
హే యా పయనమే బాగుందీ ఈ పయనమే
తాకే ఏ తీరమే పయనమే పయనమే
చరణం 2:
మళ్ళీ మళ్ళీ ఆ ఊహలే
ఎదపైనే వాలి సీతాకోకలవుతుంటే
అటు వీచే గాలి ఇటు వైపే తుళ్ళి
పెదవుల పై ఓ పాటై మురిసిందే
ఉండక ఓ చోట ఏమీ తోచక ఓ చోట
కాలం కదలదు ఈ పూట అర్థం కాదే ఈ ఆట
యా పయనమే సాగే ఈ పయనమే
చేరే ఏ గమ్యమే పయనమే పయనమే
హే యా పయనమే బాగుందీ ఈ పయనమే
తాకే ఏ తీరమే పయనమే పయనమే

కామెంట్‌లు లేవు:
కామెంట్‌ను పోస్ట్ చేయండి