Cast Crew:-Vadde Naveen, Maheswari, Laya
Music:-Vandemataram Srinivas
Language:-Telugu
ఆమె
నీలి గగనంలో ఒక మెరుపై
స్వాతి చినుకుల్లో ఒక చినుకై
కన్ను తెరిచిన వలపు ఇదా
నిన్ను తడిమిన తలపు ఇదా
మదమరచిన నిమిషములో
గుండె పిలిచిన పిలుపు ఇదా
ఊగకైన మాట నేర్పు
తొలి తొలి వలపు ఇదా
అతడు
నీలి గగనంలో ఒక మెరుపై
స్వాతి చినుకుల్లో ఒక చినుకై
చరణం1:
ఆమె
వెన్నెల్లో గోదావరిలా
ఉరకలు వేసే (పరుగులు తీసే)
నిన్నే చేరుకున్న గోరువంక
అతడు
ఎన్నాళ్ళు ఎప్పుడెప్పుడంటూ
నిదురకు కాచి (గుబులుతో వేచి)
నీ ఒళ్ళో వాలిపోయా సంబరంగా
ఆమె
డెడ్ లైట్ ఆరిన ఏకాంత వేళ
గుడ్ నైట్ చెప్పక రారా గోపాల
అతడు
నీ లేత పెదవుల మీద
ముద్దై విహరిస్తా.. (అహా..)
నీ నడుము వంపులతోనే
కవితలు పలికిస్తా
ఆమె
శృంగారమా సొంతానివై శోధించుకో...
అతడు
నీలి గగనంలో ఒక మెరుపై
స్వాతి చినుకుల్లో ఒక చినుకై
చరణం 2:
అతడు
వింటర్ లో ఎవరెస్ట్ అల్లే
దగదగలాడే (సొగసులన్నీ)
కౌగిళ్ల గాలమేసి ఖైదు చేయనా
ఆమె
లవ్ అంటూ జివ్వున పొంగి
చకచకలాడే (దిగువుల మీద)
ముద్దొచ్చే ముద్దు పెట్టి లాలించవా
అతడు
నైటీలో దాగిన చంపా చమేలీ
నాటీగా చూపిస్తా రావేమై వెరైటీ
ఆమె
చేయి ఉంటే చేలో నాగలి
దున్నుకుపోవోయ్.. (హై హై..)
తుమ్మెదలా తీయని తేనెలు
జుర్రుకుపోవోయ్...
అతడు
హే కన్నుగోటితో కసి గువ్వనే కవ్వించనా
ఆమె
నీలి గగనంలో ఒక మెరుపై
స్వాతి చినుకుల్లో ఒక చినుకై
కన్ను తెరిచిన వలపు ఇదా
నిన్ను తడిమిన తలపు ఇదా
మదమరచిన నిమిషములో
గుండె పిలిచిన పిలుపు ఇదా
ఊగకైన మాట నేర్పు
తొలి తొలి వలపు ఇదా

0 కామెంట్‌లు