Movie: Ontari,
Cast: Gopichand, Bhavana, Ali
Director: B V Ramana,
Music: Mani Sharma,
అతడు చెప్పాలనుంది చిన్న మాటైనా
ఆగనంది దాగనంది లోలోనా
ఇన్నాళ్ల నుండి వున్నమటైనా
ఇప్పుడేగా చెప్పమంది ప్రేమైనా
ఆమె
పెదవే కదిలించుకో
మనసే వినిపించుకో
పరదా తొలగించు కొంతైనా ఆ ఆ
సరిలే అనిపించుకో
త్వరగా చెయ్యందుకో
నీకోసం వేచిచూస్తున్నాఆఆ
అతడు
చెప్పాలనుంది చిన్న మాటైనా
ఆగనంది దాగనంది లోలోనా
ఇన్నాళ్ల నుండి వున్నమటైనా
ఇప్పుడేగా చెప్పమంది ప్రేమైనా
అతడు
గుండె లయలో ఓ.. దీంత ధిరనా
యెన్ని కధలో ప్రేమ వలనా
హాయి అలలో ఓ.. ఊయలవనా
రేయి నదిలో జాబిలవనా
ఆమె
నీ ప్రేమలోనె మేలుకుంటున్న
మేఘాలపైనే తేలిపోతున్నా
నాకు తెలియని
నన్ను కనుగొని నవ్వుకుంటున్నా
అతడు
చెప్పాలనుంది చిన్న మాటైనా
ఆగనంది దాగనంది లోలోనా
ఇన్నాళ్ల నుండి వున్నమటైనా
ఇప్పుడేగా చెప్పమంది ప్రేమైనా
అతడు
వెంటనడిచే ఓ.. నీడననుకో
జంటనడిపే జాడననుకో
పూలు పరిచే ఓ దారిననుకో
నిన్ను కలిసే బంధమనుకో
ఆమె
నా ప్రేమ లోకం నువ్వే అంటున్నా
నీతో ప్రయాణం ఇష్టమేనన్నా
ప్రేమ తెలిపిన రామ చిలుకను
హత్తుకోమన్నా
అతడు
చెప్పాలనుంది చిన్న మాటైనా
ఆగనంది దాగనంది లోలోనా
ఇన్నాళ్ల నుండి వున్నమటైనా
ఇప్పుడేగా చెప్పమంది ప్రేమైనా
ఆమె
పెదవే కదిలించుకో
మనసే వినిపించుకో
పరదా తొలగించు కొంతైనా ఆ ఆ
సరిలే అనిపించుకో
త్వరగా చెయ్యందుకో
నీకోసం వేచిచూస్తున్నాఆఆ
అతడు
చెప్పాలనుంది చిన్న మాటైనా
ఆగనంది దాగనంది లోలోనా
ఇన్నాళ్ల నుండి వున్నమటైనా
ఇప్పుడేగా చెప్పమంది ప్రేమైనా

కామెంట్‌లు లేవు:
కామెంట్‌ను పోస్ట్ చేయండి