Ye Parijathammuliyagalano Sakhi Song Lyircs in Telugu | Eka veera Movie | ఏ పారిజాతమ్ములీయగలనో సఖీ



 చిత్రం : ఏకవీర
గానం : ఎస్.పి.బాలసుబ్రమణ్యం
రచన : సి.నారాయణరెడ్డి
సంగీతం : కె.వి.మహదేవన్





ఏ పారిజాతమ్ములీయగలనో సఖీ
గిరి మల్లికలు తప్ప గరికపూవులు తప్ప
ఏ కానుకలను అందించగలనో చెలీ
గుండెలోతుల దాచుకున్న వలపులు తప్ప
జగతిపై నడయాడు చంచలా వల్లికా
తరుణి ఆకృతి దాల్చు శరదిందు చంద్రికా 
ఆఆఆఆఆఆ 
శరదిందు చంద్రికా
ఆఆఆఆఆఆఆ 
నీవు లేని తొలి రాతిరి 
నిట్టూర్పుల పెను చీకటి
నీవు లేని విరి పానుపు 
నిప్పులు చెరిగే కుంపటి
విరులెందుకు సిరులెందుకు
మనసు లేక మరులెందుకు
తలపెందుకు తనువెందుకు
నీవు లేక నేనెందుకు 
నీవు లేక నేనెందుకు 
కలువపూల చెంత చేరి 
కైమోడుపు చేతును
నా కలికి మిన్న కన్నులలో 
కలకలమని విరియాలని
మబ్బులతో ఒక్కమారు 
మనవి చేసికొందును
నా.. అంగన ఆలాంగనమున 
ముంగురులై కదలాలని
చుక్కలతో ఒక్కసారి చూసింతును 
నా ప్రేయసి నల్లని వాల్జడ సందుల 
మల్లియనై మొలవాలని
పూర్ణ సుధాకర బింబమునకు వినతి చేతును
నా కొలతికి ముఖబింబమై 
కలలు దిద్దుకోవాలని
ప్రకృతి ముందు చేతులెత్తి ప్రార్ధింతు 
కడసారిగా ఆఆఆఆఆఆ ఆఆఆఆ 
నా రమణికి బదులుగా 
ఆకారం ధరియించాలని

This lyrics are for educational and promotional purposes only.

All rights belong to the respective owners.

కామెంట్‌ను పోస్ట్ చేయండి

0 కామెంట్‌లు