అతడు
వెలిగించవే చిన్ని వలపు దీపం
వెలిగించవే చిన్ని వలపు దీపం
ఎందుకే నా మీద యింత కోపం
వెలిగించవే చిన్ని వలపు దీపం
ఎందుకే నా మీద యింత కోపం
ఆమె
మనసులో ప్రణయమే కలత దీపం
దాని వెలిగించుకోకున్న పాపం
అతడు
నీ మోముపై కుంకుమే నాకు దీపం
అది చూచినంతనే కలిగేను తాపం
వెలిగించవే చిన్ని వలపు దీపం
ఆమె
నీ కనులలోననే నిలిచెనే దీపం
ఆ దీపమున్నదే నాకేమి లోపం
అతడు
గగనంపు మేడలో కలదులే దీపం
అది మలగిపోయెనా అవనికే శాపం
వెలిగించవే చిన్ని వలపు దీపం
ఆమె
తారకా నవదీప తోరణాలవిగో
జగతిలో వెలుగుకే కారణాలవిగో
అతడు
ఎదలోన అనురాగ మెనయుటే దీపం
ఆ దీపమున్నచో నాకేమి లోపం
వెలిగించవే చిన్ని వలపు దీపం
ఎందుకే నా మీద యింత కోపం
వెలిగించవే........

కామెంట్‌లు లేవు:
కామెంట్‌ను పోస్ట్ చేయండి