SAMMAKKA SARAKKA FULL SONG LYRICS IN TELUGU
పల్లవి:
అమ్మ సమ్మవ్వ.. సారవ్వ మేడారమందు
వనదేవతలై వెలిసిన ఆడబిడ్డలే ఆ తల్లి
నిండు పున్నమి పొద్దు మీ పండుగే తల్లి
అమ్మ సమ్మవ్వ.. మా తల్లి సారవ్వ
హే చిలుకలది గట్టు.. సిరులిచ్చే అమ్మల రూపం
హంసలది గట్టు.. వెలుగులు చిమ్మే దీపం
హే తారు తారు బండ.. జంపన్నది వాగు
వాగుల్ల మునగంగా.. ఆది పాపాలన్నీ కడుగు
చరణం 1:
తైదీ దిమ్మెడారం.. ధరణేలమ్మ త్యాగం
సమ్మక్క సారక్క.. పసుపు కుంకుమ సల్లేం
గజ్జలదీ మోత .. చిమిడిక డప్పుల ఏత
ధరణి దద్దరిల్ల.. శివ సత్తుల కోత
ఎత్తు బంగారాలు.. తల్లులకు నైవేద్యాలు
కల్లు పానీయాలే
చరణం 2:
ఇగా రెండేల్లా కొసరి .. మీ దండి జాతర తల్లి
కోట్లాది భక్తులు.. మిమ్ము కోరి వత్తురు తల్లి
ఘటము కుండలతోనే.. మీరు ఘనముగ వచ్చేరమ్మ
కంక వనంముతోని .. మీరు కదిలి వచ్చేరమ్మ
అగ్గి దివిటీలు పట్టి.. అడుగులేయగా తల్లి
పసుపు కుంకుమ రాలే
చరణం 3:
కోయ రాజుల చేత.. కుంకుమ భరిణెత్తంగా
సమ్మక్క సారక్క.. శివమెత్తి ఆడంగా
తల్లులు గద్దెకు రాంగా.. చిక్కులు అడ్డం కాంగా
జిలపయ్యలు కొట్టి.. తల్లులను గద్దెకు చేరంగా
నలుదిక్కులు వణికి.. నల్ల మబ్బులు గమ్మి
శక్తులే బెదిరిపోంగా
చరణం 4:
భక్తులంతా చేరి.. భక్తితో తల్లుల గొలువ
చీరె సారె పెట్టి.. ఒడి బియ్యం పోసి తలువ
కోరిన భక్తుల ఇంట.. కొంగు బంగారాలే
గొలిచిన భక్తుల ఇంట.. కొప్పు సంతోషాలే
అమ్మ సమ్మక్క సారక్క.. కుంకుమ భరిణై వెలిసి
జగమంతా ఏలంగా
.jpg)
కామెంట్‌లు లేవు:
కామెంట్‌ను పోస్ట్ చేయండి