మట్టి గాజులు నీ సిన్ని సేతులు
Song: Matti Gajulu
Artist Name: Dilip Kumar,Vagdevi
Music: Madeen Sk
Lyrics: Sai Prasad Poojari
Singer's : Vagdevi , Boddu Dilip
పల్లవి:
అతడు
మట్టి గాజులు నీ సిన్ని సేతులు
పట్టగొలుసులు నీ కాలి మడిమలు
ముద్దాడుతున్నాయమ్మో.. సిట్టమ్మ
నన్ను ముట్టనీయవమ్మా
ముద్దాడుతున్నాయమ్మో.. సిట్టమ్మ
నేనేమి చేశానమ్మా
ఆమె
గాజుల సవ్వడి నాకెంతో నచ్చింది
గజ్జెల సప్పుడు నా గుండె దోసింది
నువ్వేమి చేశావురా.. చిన్నోడ
అబ్బి నువ్వు ఒకటేలరా
నువ్వేమి చేశావురా.. చిన్నోడ
అబ్బి నువ్వు ఒకటేలరా
అతడు
గజ్జెల సప్పుడు వింటావే సిట్టమ్మ
నా గుండె చప్పుడు పట్టించుకోవమ్మా
పిల్లలు కోరస్
చూడమ్మ సిట్టమ్మ
పాపం ఈ చిన్నోడు అల్లాడిపోతున్నాడే
నీ చేతి గాజుపై నీ కాలి గజ్జెపై కుళ్లుకుంటున్నాడే
అతడు
పగడపు ముత్యాలు నీ మెడ వంపుల్లో
పసిడి వడ్డాణాలు నీ నడుము ఒంపుల్లో
ఉయ్యాలలూగేనమ్మా.. సిట్టమ్మ
నన్ను ఊరడించేనమ్మా
ఉయ్యాలలూగేనమ్మా.. సిట్టమ్మ
నేనేమి చేశానమ్మా
ఆమె
ముత్యాల మిలమిలలు పెంచేరా అందాలు
పసిడి ఆభరణాలే ఆడోళ్ళ ప్రాణాలు
వాటితో పోలికేల.. చిన్నోడ
అబ్బి నువ్వు ఒకటేలరా
వాటితో పోలికేల.. చిన్నోడ
అబ్బి నువ్వు ఒకటేలరా
అతడు
బంగారు గొలుసుల భ్రమలెందుకే బొమ్మ
బంగారమసువంటి మనసున్నదే గుమ్మ
పిల్లలు కోరస్
చూడమ్మ సిట్టమ్మ పాపం ఈ చిన్నోడు
సొమ్మసిల్లుతున్నాడే
మెడలోన ముత్యాలు నడుములో
గొలుసులు చూసి నలుగుతున్నాడే
అతడు
విరిబూసిన మల్లెలు కొప్పు కౌగిల్లో
రంగు రంగు రాళ్లు నీ ఉంగరాల్లో
నవ్వుతున్నాయమ్మో.. సిట్టమ్మ
నన్ను ఏడిపించేనమ్మా
నవ్వుతున్నాయమ్మో.. సిట్టమ్మ
నేనేమి చేశానమ్మా
ఆమె
మల్లెల వాసన మనసునే గెలిచేరా
రంగు రంగు రాళ్లు రాతనే మార్చేరా
నువ్వేమి చేశావురా.. చిన్నోడ
అబ్బి నువ్వు ఒకటేలరా
నువ్వేమి చేశావురా.. చిన్నోడ
అబ్బి నువ్వు ఒకటేలరా
అతడు
పూలనీ రాళ్ళనీ మెచ్చుకుంటావమ్మా
ప్రాణమిచ్చే నన్ను ఎంచుకోవెందమ్మా
పిల్లలు కోరస్
చూడమ్మ సిట్టమ్మ పాపం ఈ చిన్నోడు
అలసిపోతున్నాడే చెప్పులరిగేదాకా
తిరిగినా చూస్తాలే అని చింతపడుతున్నాడే
అతడు
పంచభూతాలకు పరువాలిచ్చి
పట్టించుకోవెందుకే నన్ను పిచ్చి
కడదాకా నేనొస్తానే.. సిట్టమ్మ
స్వర్గంకు తోడొస్తానే
పట్టించుకోవెందుకే.. సిట్టమ్మ
పలకరించవేందుకే
ఆమె
పండుగ చేసుకో పడిపోయినాను
పత్రిక వేసుకో పెళ్ళామౌతాను
నీ ముద్దు మాటలతో.. చిన్నోడ
నా మనసే కరిగించినావు
నీ పట్టు తువ్వాలకు.. చిన్నోడ
నా కొంగు ముడివేసుకో

0 కామెంట్‌లు