చిత్రం: మంచి మనుషులు (1974)
సంగీతం: కె.వి. మహదేవన్
గీతరచయిత: ఆచార్య ఆత్రేయ
నేపథ్య గానం: బాలు, సుశీల
పల్లవి:
ఆమె
పడకు పడకు వెంట పడకు
పడచు పిల్లకు ఆశపడకు
పోపోరా ఆఆఆఆఆ
చినవాడా ఆ...
పడకు పడకు వెంట పడకు
పడచు పిల్లకు ఆశపడకు
పోపోరా ఆఆఆఆ
చినవాడా ఆ...
అతడు
పడకు పడకు అడ్డుపడకు
పడుచు వాణ్ణి చేయి విడకు
పోలేనే ఏఏఏఏ
చినదానా ఆ...
పడకు పడకు అడ్డుపడకు
పడుచు వాణ్ణి చేయి విడకు
పోలేనే ఏఏఏఏ
చినదానా ఆ..
చరణం1
అతడు: లైలా ఆఆఆఆ
ఆమె
మజ్ఞూ... మజ్ఞూ...
అతడు
మేలిముసుగులో పైడిబొమ్మలా
మిసమిసలాడే లైలా
నీ సొగసుకు సలాము చేస్తున్న
నీ సొగసుకు సలాము చేస్తున్నా
ఆమె
సొగసును మించిన మగసిరితో
నా మనసును దోచిన మజ్ఞూ
నీ మమతకు గులామునవుతున్న
నీ మమతకు గులామునవుతున్న
అతడు
పెళ్ళికూతురై ఈఈఈ
వెళ్ళుతున్నావా ఆ...
మన ప్రేమను ఎడారి చేశావా
మన ప్రేమను ఎడారి చేశావా
ఆమె
పెళ్ళి తనవుకే.. చేశారూ..
మన ప్రేమ మనసుకే వదిలారూ
మన ప్రేమ మనసుకే వదిలారూ
అతడు:
లైలా ఆఆఆఆఆ...
ఆమె
పడకు పడకు వెంట పడకు
పడచు పిల్లకు ఆశపడకు
పోపోరా ఆఆఆఆ
చినవాడా..ఆ.
అతడు
ఏహే.. ఏఏఏ
పడకు పడకు..అడ్డుపడకు
పడుచు వాణ్ణి చేయి విడకు
పోలేనే ఏ..
చినదానా ఆ..
చరణం 2:
అతడు
అనార్ (ఆ:సలీం)
గులాబి పూలతోటలో ఓఓఓఓఓ
ఖవ్వాలి తీపిపాటలో
గులాబి పూలతోటలో
ఖవ్వాలి తీపిపాటలో
సలీము లేత గుండెకు
షరాబు మత్తు చూపినా ఆఆఆఆఆ
అనార్కలీవి నువ్వు
అనార్కలీవి నువ్వు
ఆమె
ఆఆఆఆఆ
మొఘల్ సింహాసనానికి
ఆఆఆఆఆఆ
కసాయి శాసనానికి
మొఘల్ సింహాసనానికి
కసాయి శాసనానికి
సవాల్‌గా జవాబుగా
గరీభ్నేవరించినా ఆఆఆ
జహాపనావు నువ్వు
జహాపనావు నువ్వు
సలీం సలీం సలీం....
అతడు:
అనార్...
పవిత్ర ప్రేమకు..
సమాధి లేదులే..ఏ..ఏ..ఏ
చరిత్ర మొత్తమే..
విషాధగాథలే..ఏ..ఏ..ఏ..
విషాధగాథలే..
ఆమె
పడకు పడకు వెంట పడకు
పడచు పిల్లకు ఆశపడకు
పోపోరా ఆఆఆఆఆ
చినవాడా ఆ...
అతడు
ఏహే.. ఏఏఏఏ
పడకు పడకు అడ్డుపడకు
పడుచు వాణ్ణి చేయి విడకు
పోలేనే ఏఏఏఏ
చినదానా ఆ...
ఆమె:
ఆఆఆపోపోరా ఆఆఆఆఆ
చినవాడా..ఆ
అతడు:
ఏహే ఏఏఏ
పోలేనే ఏఏఏఏఏ
చినదానా ఆఆఆఆ
ఆమె:
పోపోరా ఆఆఆఆఆ
చినవాడా ఆఆఆఆ

0 కామెంట్‌లు