Manasu Manasu Song Lyrics in Telugu II Kalisundham Raa Movie II Venkatesh, Simran || మనసు మనసు కలిసిపోయే



Movie Name : Kalisundham Raa Starring : Venkatesh, Simran Music : S.A.Raj Kumar Lyrics : Veturi Singers : S.P.Balasubramanyam, Chitra


పల్లవి
అతడు 

మనసు మనసు కలిసిపోయే

కనులు ఎదలు తడిసిపోయే

మూడు తరాల దూరమంతా ముచ్చటైపోయే 


అతడు

మనసు మనసు కలిసిపోయే


ఆమె

కనులు ఎదలు తడిసిపోయే


అతడు

మూడు తరాల దూరమంతా ముచ్చటైపోయే


ఆమె

ఏడు స్వరాల రాగబంధం ముద్దుగా మ్రోగే


అతడు

ఇల్లేస్వర్గమాయే ఎదజల్లే మూగప్రేమల్లోనా


ఆమె

మూడు తరాల దూరమంతా ముచ్చటైపోయే


అతడు

ఏడు స్వరాల రాగబంధం ముద్దుగా మ్రోగే


అతడు

కలిగిన కలతలు కరిగిన వేళ 

కవితలు చెలరేగే


ఆమె

మనుషులు మనసులు ఎదిగిన వేళ 

మమతలు విరబూసే


అతడు

ఊరువాడ ఉయ్యాలూగే 

హుషారంతా మందేలే


ఆమె

నింగినేల తాళాలేసే సరాగాలు మాకేలే


అతడు

తాతే మనవడాయే నానమ్మే మనువు ఆడేవేళ


ఆమె

అరవై యేళ్ల కుర్రవాడి ఆశకే పెళ్లి 


అతడు

మనసు మనసు కలిసిపోయే


ఆమె

కనులు ఎదలు తడిసిపోయే


ఇద్దరు

మూడు తరాల దూరమంతా ముచ్చటైపోయే 


అతడు

నిన్ను ఎంతగా ప్రేమిస్తున్నానో

చెప్పడానికి భాషలో లేదు ఆశే తప్ప

నువ్వే నా ప్రాణం నువ్వే నా సర్వస్వం 

నువులేని ఈ లోకం నాకు శూన్యం


చరణం 2

అతడు

అరగని అరుగులు అలికిన వేళ 

అతిధుల కాహ్వానం


ఆమె

తొలకరి వయసులు పలికిన వేళ 

తరగని అభిమానం


అతడు

 హే హే హే ఈడుజోడు ఆడే పాడే 

పదాలన్ని మావేలే


ఆమె

ఏకమైన మా గుండెల్లో శృతిలయ ప్రేమేలే


అతడు

వీర రాఘవయ్య 

నీపేరే నిలుపుకుంటామయ్య


ఆమె

ఇల్లు ఇల్లు ఏకమైన పండగేనాడే 


అతడు 

మనసు మనసు కలిసిపోయే


ఆమె

కనులు ఎదలు తడిసిపోయే


అతడు

మూడు తరాల దూరమంతా ముచ్చటైపోయే


ఆమె

ఏడు స్వరాల రాగబంధం ముద్దుగా మ్రోగే


అతడు

ఇల్లేస్వర్గమాయే ఎదజల్లే మూగప్రేమల్లోనా


ఇద్దరు

మూడు తరాల దూరమంతా ముచ్చటైపోయే

ఏడు స్వరాల రాగబంధం ముద్దుగా మ్రోగే


This lyrics are for educational and promotional purposes only.

All rights belong to the respective owners.


కామెంట్‌లు లేవు:

కామెంట్‌ను పోస్ట్ చేయండి