DandaKadiyal Song Lyric in Telugu | Dhamaka | Ravi Teja | Sreeleela | Thrinadha Rao | Bheems Ceciroleo



Song Credits:
Song name - Dandakadiyal
Singers- Bheems Ceciroleo, Sahithi Chaganti & Mangli
Lyricist - Bheems Ceciroleo
Music Composer - Bheems Ceciroleo




లైలైలై లే..లైలైలై లే
లైలైలై లే లేలైలైలై లే
అతడు
దండకడియాల్
యే, దండ కడియాల్ దస్తీ రుమాల్
మస్తుగున్నోడంటివే పిల్లో
అరె, కిరు కిరు చెప్పుల కిన్నెరమోతల
పల్లెటూరోడంటివె పిల్లో
యే, దండ కడియాల్ దస్తీ రుమాల్
మస్తుగున్నోడంటివే పిల్లో
కిరు కిరు చెప్పుల కిన్నెర మోతల
పల్లెటూరోడంటివె పిల్లో
ఆమె
గజ్జెల పట్టీలిస్తివో
గాజులిచ్చి బుట్టలో వేస్తివో
ముక్కెర నువ్వై పూస్తివో
నీ ముద్దుల ముద్దెరలేస్తివో
అరె, సందడి వోలె వస్తివో
సోకు లంగడి తీసుపోతివో, ఓ ఓ ఓ
యే, దండ కడియాల్
అరెరె, దస్తీ రుమాల్
యే, దండ కడియాల్
దస్తి రుమాల్
మస్తుగున్నవ్ లేర పిలగో
అతడు
కిరు కిరు చెప్పుల కిన్నెరమోతల
పల్లెటూరోడంటివె పిల్లో
ఆమె
నీ చూపుల తల్వారు 
నా సెంపల తీన్మారు
సంపెంగ మొగ్గల మంచం ఎక్కి
తెంపెయ్ నవారు
అతడు
నీ మెట్టల జాగీరు
చేపట్టే జాగీరుదారు
నీ పట్టా భూమిలో గెట్టు
నాటుకుంటా జోర్దారు
ఆమె
ఇంచుమించు నీదే పోరా 
చుట్టూ శివారు
అటు ఇటు చూడకుండా
చేసేయ్ షికారు
అతడు
ఆగమన్న ఆగేటోన్ని కాదే బంగారు
దూకమంటే ఆగుతాడా దుమ్ములేపే
నాలోని మీసమున్న మగాడు
ఆమె
హే, దండ కడియాల్
అరెరెరె, దస్తీ రుమాల్
హే, దండ కడియాల్ దస్తీ రుమాల్
మస్తుగున్నవ్ లేర పిలగో
అతడు
అది అది, అరెరెరె,కిర్రు కిర్రు చెప్పుల
కిన్నెర మోతల పల్లెటూరోడంటివే పిల్లో
పిల్లలు కోరస్
అల్లో మల్లో రాముల మల్లో
(అల్లో మల్లో రాముల మల్లో)
జిల్లేడాకుల బెల్లం పెట్టె
(జిల్లేడాకుల బెల్లం పెట్టె)
నాకు పెట్టక నక్కకి పెట్టె
(నాకు పెట్టక నక్కకి పెట్టె)
నక్క నోట్లో బెల్లం ఇరికే
(నక్క నోట్లో బెల్లం ఇరికే)
పీక్కుంటు పీక్కుంటు బయ్యారం పాయే
(పీక్కుంటు పీక్కుంటు బయ్యారం పాయే)
అప్పుడే మా ఒళ్ళు జల్లుమనే
(అప్పుడే మా ఒళ్ళు జల్లుమనే)
తోట్లో ఉన్నకూడా గుబ్బల పర్సు
గుబ్బల పర్సుకు జబ్బల రైక
ఆమె
నీ కంది పువ్వునురా
నే కంది పోతానురా
నీ ఎకరంనర చాతితోనే
చత్తిరి పట్టేయిరా
అతడు
నీ సింగుల సెండోలే
నీ కొంగుల దండోలే
నీ గుండెల నిండ
ఎన్నెల కుండ దింపిపోతాలే
ఆమె
సింత మీద సిలకోలే కనిపెడతావా
బాయి మీద గిలకోలే నులిపెడతావా
అతడు
ఏ, గుడిసెలో గొడవేదో ఎపుడుండేదే పిల్లా
మడిసెల్లో నిలబడి వడిసెల్లో రాయి బెట్టి
ఇసిరిసిరి కొడతమే
ఆమె
హే, దండ కడియాల్
అరెరెరె, దస్తీ రుమాల్
హే, దండ కడియాల్ దస్తీ రుమాల్
మస్తుగున్నవ్ లేర పిలగో
అతడు
హే, కిర్రు కిర్రు చెప్పుల కిన్నెర మోతల
పల్లెటూరోడంటివే పిల్లో

కామెంట్‌లు లేవు:

కామెంట్‌ను పోస్ట్ చేయండి