రచన : భువనచంద్ర
సంగీతం : ఎ.ఆర్.రెహమాన్
గానం : హరిహరన్, సుజాత
అతడు
చందురుని తాకినది ఆర్మ్‌స్ట్రాంగా
చందురుని తాకినది ఆర్మ్‌స్ట్రాంగా
అరె ఆర్మ్‌స్ట్రాంగా
చెక్కిలిని దోచినది నేనేగా
అరె నేనేగా
కలల దేవతకీ పెదవి తాంబూలం
ఇమ్మంది శృంగారం
కలల దేవతకీ పెదవి తాంబూలం
ఇమ్మంది శృంగారం
ఆమె
అ ఆ అ ఆ హోం హ
అతడు
చందురుని తాకినది ఆర్మ్‌స్ట్రాంగా
అరె ఆర్మ్‌స్ట్రాంగా
చెక్కిలిని దోచినది నేనేగా అరె నేనేగా
కలల దేవతకీ పెదవి తాంబూలం
ఇమ్మంది శృంగారం కలల దేవతకీ
పెదవి తాంబూలం ఇమ్మంది శృంగారం
ఆమె
చందురుని తాకినది నీవేగా
అరె నీవేగా
వెన్నెలని దోచినది నీవేగా
అరె నీవేగా
వయసు వాకిలిని తెరిచె వయ్యారం
నీ కలల మందారం
శ్రుతిలయల శృంగారం
చరణం : 1
అతడు
ఓ పూవులాంటి చెలి ఒడిలో
పుట్టుకొచ్చె సరిగమలే
ఓ పూవులాంటి చెలి ఒడిలో
పుట్టుకొచ్చె సరిగమలే
పైటచాటు పున్నమిలా
పొంగే మధురిమలే
ఆమె
ఓ.. తలపుల వెల్లువలో
తలగడ అదుముకున్నా
తనువుని పొదువుకొని
ప్రియునే కలుసుకున్నా
అతడు
తాపాల పందిరిలో
దీపమల్లె వెలుగుతున్నా
ఆమె
మగసిరి పిలుపులతో
తేనెలాగ మారుతున్నా
అతడు
కోరికల కోవెలలో కర్పూరమౌతున్నా
చందురుని చందురుని తాకినది
ఆర్మ్‌స్ట్రాంగా అరె ఆర్మ్‌స్ట్రాంగా
చెక్కిలిని దోచినది నేనేగా
అరె నేనేగా
కలల దేవతకీ పెదవి తాంబూలం
ఇమ్మంది శృంగారం
కలల దేవతకీ పెదవి తాంబూలం
ఇమ్మంది శృంగారం
చరణం : 2
అతడు
రమ్మనే పిలుపు విని రేగుతోంది యవ్వనమే
ఏకమై పోదామంటూ జల్లుతోంది చందనమే
ఆమె
నీటిలోని చేపపిల్ల నీటికి భారమౌనా
కోరుకున్న ప్రియసఖుడు కౌగిలికి భారమౌనా
అతడు
చెంతచేర వచ్చినానే చేయిజారిపోకే పిల్లా
ఆమె
పిల్లగాడి అల్లరిని ఓపలేదు కన్నెపిల్ల
అతడు
ఓ.. అలిగిన మగతనమే పగబడితే వీడదే
ఆమె: చందురుని
అతడు:
చందురుని తాకినది ఆర్మ్‌స్ట్రాంగా
చెక్కిలిని దోచినది నేనేగా
అరె నేనేగా
కలల దేవతకీ పెదవి తాంబూలం
ఇమ్మంది శృంగారం
కలల దేవతకీ పెదవి తాంబూలం
ఇమ్మంది శృంగారం
కామెంట్‌లు లేవు:
కామెంట్‌ను పోస్ట్ చేయండి