చిత్రం : శారద (1973)
సంగీతం : చక్రవర్తి
గీతరచయిత : సినారె
నేపథ్య గానం : సుశీల
ఆ ఆ ఆ ఆ
వ్రేపల్లె వేచెనూ వేణువు వేచెనూ
వ్రేపల్లె వేచెనూ వేణువు వేచెనూ
వనమెల్ల వేచేనురా ఆ
నీరాక కోసం నిలువెల్ల కనులై
నీరాక కోసం నిలువెల్ల కనులై
ఈ రాధ వేచేనురా
రావేలా రావేలా
కోకిలమ్మ కూయనన్నదీ నీవు లేవని
కోకిలమ్మ కూయనన్నదీ నీవు లేవని
గున్న మావి పూయనన్నదీ నీవు రావని
ఆ ఆ ఆ ఆ ఆ ఆ
కాటుక కన్నీటి జాలుగా జాలి జాలిగా
కాటుక కన్నీటి జాలుగా జాలి జాలిగా
కదలాడే యమునా నది
నీరాక కోసం నిలువెల్ల కనులై
ఈ రాధ వేచేనురా
రావేలా రావేలా
మా వాడ అంటున్నదీ స్వామి వస్తాడని
మా వాడ అంటున్నదీ స్వామి వస్తాడని
నా నీడ తానన్నదీ రాడు రాడేమని
ఆ ఆ ఆ ఆ ఆ ఆ
రగిలెను నా గుండె దిగులుగా కోటి సెగలుగా
రగిలెను నా గుండె దిగులుగా కోటి సెగలుగా
రావేల చిరుజల్లుగా
నీరాక కోసం నిలువెల్ల కనులై
ఈ రాధ వేచేనురా
రావేలా రావేలా
కామెంట్‌లు లేవు:
కామెంట్‌ను పోస్ట్ చేయండి