Naa Gundelo Nindipova Song Lyrics in Telugu | నా గుండెలో నీవుండిపోవా |


Movie Title:-Nuvvu Nenu
Cast Crew:-Uday Kiran, Anita
Music:-R P Patnaik
Director:-Teja
Language:-Telugu


అతడు👦
నా గుండెలో నీవుండిపోవా
నా కళ్ళల్లో దాగుండిపోవా
చిరుగాలిలా వచ్చి గుడిగంటలే కొట్టి
మన ప్రేమనే చాటవా
నా గుండెలో నీవుండిపోవా
నా కళ్ళల్లో దాగుండిపోవా
చిరుగాలిలా వచ్చి గుడిగంటలే కొట్టి
మన ప్రేమనే చాటవా
నా గుండెలో నీవుండిపోవా

ఆమె👩
నా హృదయం ప్రతి వైపు వెతికింది 
నీ కోసమేలే

అతడు👦
నా నయనం ఎటు వైపు చూస్తున్న 
నీ రూపమేలే

ఆమె👩
నీ..... పాటలో పల్లవే కావాలి

అతడు👦
నా..... ఎదలో మెదిలే కధలే పాడాలి

ఆమె👩
నీ కళ్ళల్లో నన్నుండిపోనీ
నీ గుండెలో రాగాన్ని కానీ
సిరివెన్నెలై వచ్చి కనురెప్పలే తెరచి
మన ప్రేమనే చూపనీ
నీ కళ్ళల్లో నన్నుండిపోనీ

అతడు👦
ఏ నిమిషం మొదలైనదో గాని 
మన ప్రేమ గాధ

ఆమె👩
ప్రతి నిమిషం సరికొత్తగా ఉంది 
ఈ తీపి బాధ

అతడు👦
ఈ.... దూరమే దూరమై పోవాలి

ఆమె👩
నీ....జతలో బతుకే నదిలా సాగాలి
నీ కళ్ళల్లో నన్నుండిపోనీ
నీ గుండెలో రాగాన్ని కానీ

అతడు👦
చిరుగాలిలా వచ్చి గుడిగంటలే కొట్టి
మన ప్రేమనే చాటవా

అతడు👦:(లాలా)ఆమె👩:(ల,ల) అతడు👦:(లల)
ఆమె👩:(లాలా) 

అతడు👦:(ల,ల) ఆమె👩:(లల)
అతడు👦(లాలా) ఆమె👩(ల,ల)
అతడు👦(లాలా) ఆమె👩:(ల,ల)
ఇద్దరు👦👩: లాలా, లల
ఇద్దరు👦👩: లాలా, లల

కామెంట్‌ను పోస్ట్ చేయండి

0 కామెంట్‌లు