Bharatha Vedamuga Song with Lyrics | Pournami Movie | Prabhas, Trisha, Charmme | Prabhu Deva | DSP

  


Song: Bharatha Vedamuga
Lyrics: Sirivennela Seetharama Sastry
Singer: K. S. Chithra
Music: Devi Sri Prasad
Cast: Prabhas, Trisha, Charmee Kaur


కోరస్ 
శంభో శంకర
హర హర మహాదేవ
హర హర మహాదేవ
హర హర మహాదేవ
తద్ధింతాధిమి ధింధిమీ
పరుల తాండవకేళీతత్పరా
గౌరీమంజుల సింజిణీ జతుల
లాస్యవినోదవ శంకరా
ఆమె
భరత వేదముగ 
నిరత నాట్యముగ
కదిలిన పదమిది ఈశా
శివ నివేదనగ అవని వేదనగ
పలికెను పదము పరేశా
నీలకంఠరా జాలిపొందరా.. 
కరుణతొ ననుగనరా
నీలకంధరా శైలమందిరా.. 
మొర విని బదులిడరా..ఆ,,
నగజామనోజ జగదీశ్వరా..
మాలేందుశేఖరా శంకరా
భరత వేదముగ 
నిరత నాట్యముగ
కదిలిన పదమిది ఈశా
శివ నివేదనగ అవని వేదనగ
పలికెను పదము పరేశా
కోరస్ 
హర హర మహాదేవ
హర హర మహాదేవ
హర హర మహాదేవ
హర హర మహాదేవ
హర హర మహాదేవ

అఆ .. అఅ హ అఆ .. అఅ

అ.. అఅ హ 
అఆ .. అఅ హ అఆ .. అఅ హ
అ.. అఅ హ 
ఆ...
అంతకాంత నీ సతి.. 
అగ్నితప్తమైనది
నేను త్యాగమిచ్చితాను
నీలో లీలమైనదీ
ఆదిశక్తి ఆకృతి.. 
అద్రిజాత పార్వతి
తాణువైన ప్రాణధవుని 
చెంతకు చేరుకున్నదీ
హ ఆఆ ఆఆ ఆ  
హ ఆఆ ఆ 
భవుని భువుకి తరలించేలా.. 
ధరణి దివిని తలపించేలా
రసతరంగిణీ లీలా.. 
యతిని నృత్య రతులు చేయగలిగే.. ఈ వేళా
భరత వేదముగ 
నిరత నాట్యముగ
కదిలిన పదమిది ఈశా
శివ నివేదనగ అవని వేదనగ
పలికెను పదము పరేశా
కోరస్ 
జంగమ సావర గంగాచ్యుత శిర 
భృత మండిత కరమురహరా
భక్తశుభంకర భవనా శంకర 
స్వరహర దక్షాత్వరహరా
పాలవిలోచన పాలిత జనగణ 
కాల కాల విశ్వేశ్వరా
ఆశుతోష అథనాశ విశాషణ జయగిరీశ బృహదీశ్వరా
హర హర మహాదేవ
హర హర మహాదేవ
హర హర మహాదేవ
హర హర మహాదేవ
ఓ ఓ 
ఓ నమః శివాయ 
ఓ నమః శివాయ
ఓ నమః శివాయ
ఓ నమః శివాయ
ఓ నమః శివాయ

వ్యోమకేశ నిను హిమగిరి వరసుత 
ప్రేమ పాశమున పిలువంగా
యోగివేష నీ మనసున కలగద 
రాగలేశమైన 
హే మహేశ నీ భయదపదాహతి 
దైత్య శోషణము జరుపంగా
భోగిభూష భువనాళిని నిలుపవ 
అభయముద్రలోనా
నమక చమకముల నాదానా 
యమక గమకముల యోగానా
పలుకుతున్న ప్రాణానానా 
ప్రణవనాథ ప్రథమనాథ శృతి వినరా
హర హర మహాదేవ
హర హర మహాదేవ
హర హర మహాదేవ
హర హర మహాదేవ
హర హర మహాదేవ
హర హర మహాదేవ
హర హర మహాదేవ
హర హర మహాదేవ

కామెంట్‌ను పోస్ట్ చేయండి

0 కామెంట్‌లు