సాంగ్ : నీలి మేఘముల లో
సాహిత్యం: భరద్వాజ్ గాలి
గాయకుడు: పృథ్వీ హరీష్
సంగీతం: వివేక్ సాగర్
చిత్రం : 35 చిన్న కథ కాదు
తారాగణం: నివేదా థామస్ విశ్వదేవ్ రాచకొండ



నీలి మేఘములలో ధరణీ తేజం

నయనాంతరంగములలో వనధీ నాదం

తకిడతాం తకిడతాం

తకాధిమి తోమ్తోమ్తోమ్

తోమ్ తకిటతదిమి తజను తోం

తోమ్ తకిటతదిమి

తకిదం తకిదం

(ఆ.. ఆ .. ఆ..)

పోరునే గెలుచు పార్ధీవీ

పతి సాటిలేని ఘనుడైనా

నీరజాక్షి అలిగే వేళ

నుడివిల్లు ముడి వంచగలడా

సడే చాలు శత సైన్యాలు

నడిపే ధీరుడైనా

వసుధా వాణి మిథిలా వేణి

మది వెనుక పలుకు

పలుకులెరుగ గలడా

నీలి మేఘములలో ధరణీ తేజం

నయనాంతరంగములలో వనధీ నాదం

జలధి జలముల్ని లాలించు మేఘమే

వాన చినుకు మార్గమును లిఖించదే

ఆఆ..స్వయంవరం అనేది ఓ మాయే

స్వయాన కోరు వీలు లేదాయె

మ ప ధ ప మ ప ద ప

మ ప ద ప రి గ మ రి

మనస్సులే ముడేయు వేళా

శివాస్త్ర ధారణేల కొలాతాయే

ఆఆ

ఆఆ

వరంధాముడే వాడే

పరం ఏలు పసివాడే

స్వరం లాగ మారాడే

స్వయం లాలి పాడాడే

ఆఆ

ఆఆఆఆ

భాస్కరాభరణ కారుణీ

గుణ శౌరి శ్రీకరుడు వాడే

అవని ​​సూన అనుశోకాన

స్థిమితాన తానుండ లేడే

శరాఘాతమైనా గాని

తొణికే వాడు కాడే

సిరి సేవించి సరి లాలించి

కుశలములు నిలుప ఘనము నొదిలి కదిలే

నీలి మేఘములలో ధరణీ తేజం

నయనాంతరంగములలో వనధీ నాదం