O pilla Song Lyrics in Telugu | telugu seetayya movies lyrics


 చిత్రం : సీతయ్య (2000)
రచన : చంద్రబోస్
సంగీతం : ఎం.ఎం.కీరవాణి
గానం : ఉదిత్ నారాయణ్, చిత్ర


పల్లవి :
అతడు
ఓ పిల్లా... ఓ... పిల్లా...
ఓ పిల్లా... ఓ... పిల్లా...
అమ్మతోడు నాన్నతోడు
నినుపుట్టించిన బ్రహ్మతోడు
వదలను నిన్నే ఓ పిల్లా... 
వదలను నిన్నే ఓ పిల్లా... 
మీ అమ్మ కాదన్నా మీ నాన్న కాదన్నా
ఆ బ్రహ్మే కాదన్నా వదలను నిన్నే
ఓ పిల్లా... 
ఆమె
ఓ రాజా... ఓ... రాజా...
కొమ్మతోడు రెమ్మతోడు
కట్టుకు వచ్చిన కోక తోడు
మరువను నిన్నే ఓ రాజా...
ఓ రాజా... ఓ... రాజా...
చరణం : 1
ఆమె
ఓహో ఓహో హోహో హోహో....
ఓహో ఓహో ఒ.హో. హో....
నీ తోడుంటే దీపావళి...
నువు ఊవ్ అంటే ధూపావళి
అతడు
ఓవో ఓవో  ఓవో ఓవో
ఒక్కరు ఉంటే ఏకాదశి
జంటైతే కేకాదశి
ఆమె
సయ్యంటే ప్రతి సంధ్యకి
సుఖాల సంక్రాంతి
అతడు
నువ్వుంటే ప్రతి రాతిరి
అయ్యేను నవరాత్రి
ఆమె
నా తీగను అల్లితే నాగుల పంచమిలే
అతడు
నీ సోకులు అందితే గోకుల అష్టమిలే
బ్రతకుంతా సీతారాముల నవమే
ఓ పిల్లా... ఓ పిల్లా... ఓ... పిల్లా...
అమ్మతోడు నాన్నతోడు
నినుపుట్టించిన బ్రహ్మతోడు
వదలను నిన్నే ఓ పిల్లా...
చరణం : 2
అతడు
ఓహో ఓహో హోహో హోహో....
ఓహో ఓహో ఒ.హో. హో....
బిడియాలతో బిల్లంగోడు
పిల్లా నేడే ఆడేయనా
ఆమె
ఓహో ఓహో హోహో.హో.హో.
ఓహో ఓహో ఒ.హో.హో...
వయ్యారంతో వామనగుంటా
ఆడించి ఓడించవా
అతడు
పెదాల కోలాటాలే ఈవేళ ఆడాలి
ఆమె
గదుల్లో కోతికొమ్మ గలాటా చూడాలి
చలి దాగుడుమూతల
ఆటకు ముందుకు రా
ఆమె
నను గుజగుజ రేకుల
ఆటకు గుంజకురా
మనువాటే ఆడి మొగుడై పోరా
ఓ రాజా... ఓ రాజా... ఓ... రాజా...
కొమ్మతోడు రెమ్మతోడు
కట్టుకు వచ్చిన కోక తోడు
మరువను నిన్నే ఓ రాజా...
మరువను నిన్నే ఓ రాజా...
ఏ కొమ్మ కాదన్నా ఏ రెమ్మ కాదన్నా
నా కోకే కాదన్నా మరువను నిన్నే
ఓ రాజా...
అతడు
ఓ పిల్లా... ఓ పిల్లా...
అతడు

కామెంట్‌లు లేవు:

కామెంట్‌ను పోస్ట్ చేయండి