గాయని: పి. సుశీల
పల్లవి:
పంచముఖీ గాయత్రీ మహామాతవే
పంచముఖీ గాయత్రీ మహామాతవే
జగదంబా శ్రీమాత అవినాశినీ...
అవినాశినీ మాతవే
పంచముఖీ గాయత్రీ మహామాతవే
పంచముఖీ గాయత్రీ మహామాతవే
చరణం 1:
సహస్రాక్షి సహస్రరూపి సర్వవ్యాపివే
వెలుగు చూపి నడిపించు సర్వశక్తివే
సహస్రాక్షి సహస్రరూపి సర్వవ్యాపివే
వెలుగు చూపి నడిపించు సర్వశక్తివే
మహామాయ మహామోహ మంత్రశక్తివే
మహామాయ మహామోహ మంత్రశక్తివే
దిక్కులన్నీ పాలించు దివ్యశక్తివే
పంచముఖీ గాయత్రీ మహామాతవే
పంచముఖీ గాయత్రీ మహామాతవే
చరణం 2:
శంఖచక్ర పరశుధారి సర్వధాత్రివే
ముల్లోకములనేలే విశ్వవంద్యవే
శంఖచక్ర పరశుధారి సర్వధాత్రివే
ముల్లోకములనేలే విశ్వవంద్యవే
కామితార్థముల నొసగు కల్పవల్లివే
కామితార్థముల నొసగు కల్పవల్లివే
కరుణించి కాపాడు కల్యాణివే
పంచముఖీ గాయత్రీ మహామాతవే
పంచముఖీ గాయత్రీ మహామాతవే
చరణం 3:
వేదమాత దేవదేవి సర్వశ్రేష్ఠివే
కృపను చూపి దీవించు కమలాక్షివే
వేదమాత దేవదేవి సర్వశ్రేష్ఠివే
కృపను చూపి దీవించు కమలాక్షివే
ప్రకృతి సౌందర్య అనుభూతివే
ప్రకృతి సౌందర్య అనుభూతివే
సిరులన్నీ కురిపించు సావిత్రివే
పంచముఖీ గాయత్రీ మహామాతవే
పంచముఖీ గాయత్రీ మహామాతవే
జగదంబా శ్రీమాత అవినాశినీ... అవినాశినీ మాతవే
పంచముఖీ గాయత్రీ మహామాతవే
పంచముఖీ గాయత్రీ మహామాతవే

కామెంట్‌లు లేవు:
కామెంట్‌ను పోస్ట్ చేయండి