Relare Ganga Songs లేబుల్‌తో ఉన్న పోస్ట్‌లను చూపుతోంది. అన్ని పోస్ట్‌లు చూపించు
Relare Ganga Songs లేబుల్‌తో ఉన్న పోస్ట్‌లను చూపుతోంది. అన్ని పోస్ట్‌లు చూపించు

Paatammathone Pranam Naaku Chaduvulammara Latest Folk Song 2022 | Rambabu | Relare Ganga Songs | Folk Song Lyrics in Telugu | పాటమ్మతోటే ప్రాణం నాకు చదువులమ్మరా

పల్లవి: 

పాటమ్మతోటే ప్రాణం నాకు చదువులమ్మరా 

పేదోళ్ళ ఇంట్ల పుట్టిన పేగు బంధం నేనురా 

అమ్మానాన్న రెక్కలాడితేనే బుక్కెడు బువ్వరా 

వాళ్ళ రెక్కల కష్టపు చెమట చుక్కల దారను నేనురా 

వాళ్ళ రెక్కల కష్టపు చెమట చుక్కల దారను నేనురా 

చరణం 1: 

ఉన్న రెండు ఎకరాలను కళ్ళ చూడలే 

మా నాన్న నాగలి కర్రు పెట్టి పొలము దున్నలే 

ఉన్న రెండు ఎకరాలను కళ్ళ చూడలే 

మా నాన్న నాగలి కర్రు పెట్టి పొలము దున్నలే

కట్నం కింద అంతా అక్కకు రాసి ఇచ్చినం 

కట్నం కింద అంతా అక్కకు రాసి ఇచ్చినం 

మా అక్కను బావ కొడితే ఎక్కి ఎక్కి ఏడ్చినం

చెప్పేటోడు లేక పది ఫెయిల్ అయిపోయినా 

చెప్పేటోడు లేక పది ఫెయిల్ అయిపోయినా 

చదువమ్మ విలువ తెలిసి.. 

ఎం.ఏ ఇంగ్లీష్ పట్టా పొందినా 

పాటమ్మతోటే ప్రాణం నాకు చదువులమ్మరా 

పేదోళ్ళ ఇంట్ల పుట్టిన పేగు బంధం నేనురా 

అమ్మానాన్న రెక్కలాడితేనే బుక్కెడు బువ్వరా 

వాళ్ళ రెక్కల కష్టపు చెమట చుక్కల దారను నేనురా

చరణం 2

చిరిగిన అంగీ లాగులేసుకొని బాల్యమంత గడిపినా 

బత్త సంచుల బుక్కులేసుకొని బడికి రోజు నేను పోయినా

చిరిగిన అంగీ లాగులేసుకొని బాల్యమంత గడిపినా 

బత్త సంచుల బుక్కులేసుకొని బడికి రోజు నేను పోయినా

అమ్మ నాన్న వాళ్ళ నెత్తురుని సత్తువగ జల్లయి నను సాదిండ్రు 

అమ్మ నాన్న వాళ్ళ నెత్తురుని సత్తువగ జల్లయి నను సాదిండ్రు 

రెండు చేతుల్లో పొడిచిన పొక్కుల 

బాధను గుండెల్లో దాసుకుండ్రు

ఏమిచ్చినా మీ రుణము తీర్చలేను ఓ నాన్నా 

ఏమిచ్చినా మీ రుణము తీర్చలేను ఓ నాన్నా 

ఈ బాధలు బందయ్యే రోజు తెస్తానే.. 

జన్మనిచ్చిన అమ్మ 

పాటమ్మతోటే ప్రాణం నాకు చదువులమ్మరా 

పేదోళ్ళ ఇంట్ల పుట్టిన పేగు బంధం నేనురా 

అమ్మానాన్న రెక్కలాడితేనే బుక్కెడు బువ్వరా 

వాళ్ళ రెక్కల కష్టపు చెమట చుక్కల దారను నేనురా

చరణం 3: 

కళ్ళకు జారిన కన్నీళ్ళతో 

పాటలెన్నో రాస్తా 

కళ్ళకు జారిన కన్నీళ్ళతో 

పాటలెన్నో రాస్తా 

మహనీయుల త్యాగాల దారిలో 

నా గొంతును వినిపిస్తా

అక్షరాల ఉక్కు పిడికిళ్లకు ఊపిరిపాటవుతా 

అక్షరాల ఉక్కు పిడికిళ్లకు ఊపిరిపాటవుతా 

చీకటి బతుకుల్లో వెలుగుల రాగమై దారులు నేనేస్తా

జ్ఞానం కోసం ధ్యానం చేసిన శంభూకున్నవుతా 

జ్ఞానం కోసం ధ్యానం చేసిన శంభూకున్నవుతా 

చదువమ్మ బాటలో పాటను నేనై.. 

స్వేరో జెండాను గుండెకద్దుకుంటా

 పాటమ్మతోటే ప్రాణం నాకు చదువులమ్మరా 

పేదోళ్ళ ఇంట్ల పుట్టిన పేగు బంధం నేనురా 

అమ్మానాన్న రెక్కలాడితేనే బుక్కెడు బువ్వరా 

వాళ్ళ రెక్కల కష్టపు చెమట చుక్కల దారను నేనురా